ఆపిల్

ఆపిల్ లో పక్షి కన్ను తెగులు

Neofabraea malicorticis

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న చిన్న, వృత్తాకార, ఎరుపు నుండి ఊదారంగు మచ్చలు బెరడుపై ఏర్పడతాయి.
  • పైకి వంకర తిరిగిన అంచులతో క్యాంకర్లు వృద్ధి చెందుతాయి.
  • వాటి మధ్యలో మీగడ వంటి తెల్లటి శిలీంధ్ర పెరుగుదల కనబడుతుంది.
  • పండ్లు మరియు ఆకులపై గోధుమ రంగు మచ్చలు మరియు ప్యాచీలు కనబడుతాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
ఆపిల్
పియర్

ఆపిల్

లక్షణాలు

కొమ్మలు మరియు రెమ్మలపై క్యాంకర్లు కనిపించడం అనేది పండ్ల చెట్లపై పక్షి కన్నుతో సంక్రమణ యొక్క అత్యంత సాధారణ లక్షణం . ప్రారంభ దశలో, ఎరుపు నుండి ఊదా రంగులో చిన్న వృత్తాకార మచ్చలు వృద్ధి చెందుతాయి మరియు తేమ ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి విస్తరించేటప్పుడు కొద్దిగా పొడుగుగా మరియు గుంతలు పడినట్టు ఉంటాయి. ఇవి నారింజ నుండి గోధుమ రంగులో ఉంటాయి. బెరడు క్షీణించినప్పుడు, అంచులలో పగుళ్లు వృద్ధి చెందుతాయి మరియు పైకి మెలికెలు తిరగడం ప్రారంభిస్తాయి. వీటి మధ్యలో మీగడ వంటి తెల్లటి శీలింద్ర పెరుగుదలను గమనించవచ్చు. క్యాంకర్ చిన్న కొమ్మలను పట్టీ లాగ చుట్టి వాటిని చంపవచ్చు. లేత ఆకులు లేదా పండ్లు కూడా ప్రభావితమవుతాయి మరియు గోధుమ రంగు మచ్చలు మరియు పాచెస్ వృద్ధి చెందుతాయి, పండ్లను నిల్వ చేసినప్పుడు "ఎద్దు కంటి కుళ్ళు తెగులు" సంక్రమిస్తుంది. ముఖ్యంగా సంపర్కానికి తేలికగా గురయ్యే రకాల్లో ఇది చెట్టు యొక్క ఆకులు రాలిపోవడానికి దారి తీస్తుంది మరియు సత్తువను తగ్గిస్తుంది. దాంతో ఇది పండ్ల నాణ్యత తగ్గడానికి దారితీస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పంట కోతల తర్వాత బోర్డియక్స్ మిశ్రమం లేదా రాగి సల్ఫేట్ వాడటం వలన తరువాతి సీజన్‌లో పక్షి కన్ను తెగులు సంభవం తగ్గుతుంది. పండ్లపై ఎద్దు కన్ను తెగులును నియంత్రించడానికి కూడా ఈ సమ్మేళనాలను పంట కోతకు ముందు ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇప్పటికే ఉన్న క్యాంకర్లను నిర్మూలించడంలో పూర్తిగా ప్రభావవంతమైనవిగా నిరూపించబడిన శిలీంధ్ర నాశినులు లేవు. ఏదేమైనా, పంటకు ముందు నివారణ శిలీంధ్ర సంహారిణిలను వాడడం వలన నిల్వ చేసేటప్పుడు పండ్లపై ఎద్దు కన్ను కుళ్ళు తెగులును తగ్గిస్తాయి. పంట కోత తర్వాత అదే వినియోగం తరువాతి సీజన్లో క్యాంకర్లను తగ్గిస్తుంది. కప్టాన్, మాంకోజెబ్ లేదా జిరామ్ ఆధారిత ఉత్పత్తులను దీనికోసం ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు ప్రధానంగా నియోఫాబ్రా మాలికార్టిసిస్ అనే ఫంగస్ వలన సంభవిస్తాయి, అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇతర శిలీంధ్రాలు కూడా ఇందులో పాల్గొంటాయి. తెగులు సోకిన మొక్కల అవశేషాలపై లేదా నేలలో ఇవి జీవించగలవు. ఇది తరచుగా వర్షపాతంతో కూడిన తేమ మరియు వెచ్చని పరిస్థితులలో వృద్ధిచెందుతుంది. వసంతకాలంలో మళ్ళీ ఇది ఎదుగుదలను ప్రారంభిస్తుంది మరియు బీజాంశాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఈ బీజాంశాలు నీరు లేదా వర్షపు తుంపర్ల ద్వారా ఇతర చెట్లు లేదా మొక్కలకు సులభంగా వ్యాపిస్తాయి. ఇవి చిన్న గాయాల ద్వారా చెట్లలోకి ప్రవేశించవచ్చు కాని గాయపడని బెరడులోకి కూడా ప్రవేశించవచ్చు. క్యాంకర్ 1 సంవత్సరం మాత్రమే చురుకుగా పెరుగుతుంది, అయితే ఫంగస్ మాత్రం 2 నుండి 3 సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యామ్నాయ అతిథి మొక్కల్లో అనేక రకాల పోమ్ (సీతాఫలజాతి) మరియు స్టోన్ (గింజలు గల)పండ్లు అలాగే హతోర్న్ మరియు మౌంటెన్ యాష్ ఉన్నాయి. అన్ని ఆపిల్ రకాలకు వివిధ స్థాయిల్లో ఈ తెగులు సంక్రమించే అవకాశం ఉంది. పియర్ చెట్లు కూడా ప్రభావితం కావచ్చు.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన వ్యాధికారక రహిత వనరుల నుండి సేకరించిన ఆరోగ్యకరమైన చెట్లను నాటండి.
  • వ్యాధికి తక్కువ అవకాశం ఉన్న చెట్ల రకాలను ఎంచుకోండి.
  • వ్యాధి సంకేతాల కోసం కొత్త చెట్లను సంపూర్ణంగా పర్యవేక్షించండి.
  • శీతాకాల కత్తిరింపు సమయంలో క్యాంకర్ తో ప్రభావితమైన కొమ్మలను కత్తిరించండి.
  • తెగులు సోకిన కాండం మరియు కొమ్మలు కనబడిన వెంటనే కత్తిరించండి.
  • తోటలో నుండి మొక్కల అవశేషాలను తొలగించండి.
  • పండ్ల తోట చుట్టూ ప్రత్యామ్నాయ అతిధి మొక్కలను నాటవద్దు.
  • మంచి ఎరువుల వాడకం మరియు బలవర్ధకాల వాడకం ద్వారా చెట్ల సత్తువను ప్రోత్సహించండి.
  • మంచి మురుగు నీటి సౌకర్యం ఉండేలా చూసుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి