వరి

వరిలో ఉద్బెట్ట తెగులు

Balansia oryzae-sativae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • కంకులు ఆకృతిని కోల్పోతాయి.
  • పై ఆకులు మరియు పై పొరలు తెల్లటి మైసీలియాల్ పొరతో తో కప్పబడి వెండి రంగులో కనపడతాయి.
  • ఎదుగుదల మందగిస్తుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వరి

లక్షణాలు

ఈ తెగులు లక్షణాలు మొదట కంకులు ఏర్పడే సమయంలో కనపడతాయి. ఈ తెగులు ఒక పద్దతిగా వ్యాపిస్తూ మొతం కంకులన్నీ దెబ్బతింటాయి. ఈ తెగులు సోకిన మొక్కలు సహజంగా చిన్నగా ఉంటాయి. పై ఆకులు మరియు పై పొరలలో తెల్లటి మైసీలియాల్ తో కప్పబడి వెండి రంగులో కనపడుతూ వుంటుంది. ఆకు కాడలు ఒంటరిగా పైకి లేచి చెడిపోయిన రంగులో సిలెండర్ ఆకారంలో ఉంటాయి.పై ఆకులు వెండి రంగులో కనిపిస్తాయి. తెల్లని మైసీలియం ఈనెల వెంబడి సన్నని చారలను ఏర్పరుస్తుంది. ఈ తెగులు సోకిన కంకులలో ధాన్యం ఏర్పడదు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

నాట్లు వేసేకంటే ముందు విత్తనాల్ని సుమారు 50-54°C విష్ణోగ్రతలో 10 నిమిషాల ఉంచటం వలన ఈ తెగులును నిరోధించవచ్చు. విధానాలకు సోలార్ ట్రీట్మెంట్ చేయడం వలన కూడా ఈ తెగులుకు వాహకాలుగా పనిచేసే వ్యాధికారక క్రిములను చంపవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కప్తాన్ లేదా తీరంతో విత్తనశుద్ధి చేయండి. ఆరెయోఫంగిన్ ( శీలింద్ర నాశిని) మరియు మాంకోజెబ్ ఈ తెగులు తీవ్రతను తగ్గిస్తుంది.అంతే కాకుండా కొన్ని రకాల వారి పంటలలో పంట దిగుబడిని కూడా పెంచుతుంది. ఒక్క తీరం తో మట్టిని ట్రీట్ చేసినా లేకపోతే ఇతర శీలింద్ర నాశినులతో కలిపి చేసినా అది విత్తన శుద్ధి చేసినదానికన్నా బాగా వుడ్బెట్ట తెగులు రాకుండా చేసి పంట దిగుబడిని పెంచుతుంది.

దీనికి కారణమేమిటి?

దక్షిణ భారత దేశంలో చాలా ప్రదేశాలలో ఈ తెగులు వివిధ రకాలుగా సోకుతుంది. ముందుగా వేసిన లేదా సీజన్ లో ఆలస్యంగా వేసిన పంటకు ఈ తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ ఫంగి విత్తనాల నుండి లేదా వారి ఆకులపైన మరియు పంట వేయడానికి ముందు పంట చుట్టూ వున్న ఇతర హోస్ట్ మొక్కల పైన కనపడుతుంది. పంట కోత అయిన తర్వాత పంట అవశేషాల్లో ఈ తెగులు స్పోర్స్ జీవించి గాలి ద్వారా లేదా నీటి ద్వారా వ్యాపిస్తాయి.గ్రేస్సేస్ ఇసాక్నే, ఎలెగాన్స్, సైనాడోన్ డక్తిలోన్, పెన్నిసేటం sp మరియు ఎరాగ్రోస్టిస్ టెన్యూఫోలియా లాంటి గడ్డి మొక్కలు ఈ తెగులుకు అతిధి పంటలుగా ఉంటాయి.ఈ తెగులు వెచ్చని వాతావరణంలో మరియు అధిక తేమ ఉనప్పుడు బాగా వ్యాపిస్తుంది. మొక్కలు వేసినప్పుడు మరియు కంకులు అభివృద్ధిని ఈ తెగులు దెబ్బతీస్తుంది. కానీ పిలకలు వేసేసమయంలో మొట్టమొదటిగా ఈ తెగులు లక్షణాలు బయటపడతాయి.


నివారణా చర్యలు

  • తెగులు రహిత మరియు తెగులు నిరోధక మొక్కలు వాడాలి.
  • తెగులు సోకిన పంట యొక్క విత్తనాలు వాడరాదు.
  • పొలాన్ని గమనిస్తూ తెగులు సోకిన కంకులను పొలం నుండి తీసివేయాలి.
  • సీజన్ కు ముందు కానీ తరువాత కానీ నాట్లు వేయాలి.
  • ఈ తెగులును ఇతర మొక్కలకు వ్యాపింపచేసే ఇతర మొక్కలను తొలగించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి