సోయాబీన్

సడన్ డెత్ సిండ్రోమ్ (అకస్మాత్తుగా చనిపోయే రుగ్మత)

Fusarium virguliforme

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • చెల్లాచెదురుగా, పసుపు మచ్చలు ఆకుల ఈనెల మధ్యన కనిపిస్తాయి.
  • మచ్చలు పెరిగి ఆకుల పై నుండి పడిపోయినట్టు కనిపిస్తాయి.
  • గోధుమ రంగు రూపంలో కాండాల మరియు వేర్ల అంతర్గత కణజాల పై కుళ్ళు లక్షణాలు కనిపిస్తాయి.
  • కాయలు పక్వానికి రావు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

చిన్న, లేత ఆకుపచ్చ, గుండ్రని మచ్చలు ఆకులపై కనిపిస్తాయి పూత సమయంలో. ఇంటర్ వీనల్ క్లోరోసిస్ మరియు తర్వాత నెక్రోసిస్ ఆకుల పై కనిపిస్తాయి. తెగులు పెరిగిన కొద్దీ ఈనెల మధ్య వున్న కణజాలం చనిపోయి పడిపోతాయి. ఆకులు ఎండి ముడుచుకుపోయి రాలి పోతాయి. లోపలి కణజాలంపై కుళ్ళు లక్షణాలు కనిపిస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఇప్పటివరకు సడన్ డెత్ సిండ్రోమ్ కు జీవ సంబంధిత నియంత్రణ లేదు. మీకు ఏమైనా తెలిస్తే మమల్ని సంప్రదించండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కీటక నాశినులు సమర్ధవంతంగా పని చేయవు ఎందుకంటే ఈ ఫంగస్ వేర్లలో ఉండిపోతుంది. అందువలన విత్తనాల పైన ఫ్లువోపైరం లాంటి కీటక నాశినులు వాడాలి

దీనికి కారణమేమిటి?

ఫుస్సరియం విర్గులిఫోర్మే ఫంగస్ మట్టిలో మరియు పంట అవశేషాల పై జీవిస్తాయి. ఇవి మొక్కలు వేర్ల వద్ద ఉండి తర్వాత పూత సమయం లో కనిపిస్తాయి. ఇవి చల్లని, తడి భూమి, వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటాయి. పొలంలో పని చేసే సమయంలో కలిగే గాయాల వలన కూడా ఇవి వ్యాపిస్తాయి


నివారణా చర్యలు

  • మంచి మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి.
  • అత్యంత నాణ్యవంతమైన విత్తనాలు వాడాలి.
  • తెగులు నిరోధక విత్తనాలను వాడాలి.
  • సీజన్లో ముందుగా పంటను నాటడం వలన తెగులు సోకకుండా కాపాడుకోవచ్చు.
  • మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంచండి.
  • తెగులు ప్రాధమిక లక్షణాల కోసం పొలాన్ని పరీక్షించాలి.
  • మంచి నీటిపారుదల సౌకర్యం కల్పించండి పొలాన్ని దున్నినెల గట్టిపడకుండా చేయండి.
  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి