సోయాబీన్

సోయాబీన్ లో ఊదా రంగు గింజ మరక తెగులు

Cercospora kikuchii

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఈ తెగులులో ఊదా రంగు నుండి గోధుమ వర్ణంలో ఉండే మరకలు ఆకులపై కనిపిస్తాయి.
  • ఎర్రని రంగు మచ్చలు కూడా కాండాలు మరియు కాయలపై కనిపిస్తాయి.
  • విత్తనాలపై గులాబీ నుండి ఊదా రంగులో మచ్చలు చిన్నగా ఏర్పడతాయి.
  • (మచ్చల నుండి పెద్ద పట్టీ లాగ) మారుతాయి.
  • ముఖ్యంగా అంకురోత్పత్తి మరియు మొలకల సమయం లో ఈ తెగులు బాగా వ్యాపిస్తుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

ఈ తెగులు ప్రధానంగా పంట ఆఖరిదశలో పువ్వులకు మరియు కాయలకు వ్యాపిస్తుంది. మచ్చలు ఊదా రంగు నుండి గోధుమ వర్ణంలో మచ్చలు ఆకులపై కనిపిస్తాయి. ఎర్రని రంగు మచ్చలు కాండాలు మరియు కాయలపై కనిపిస్తాయి. అంతేకాక విత్తనాలపై కూడా ఈ తెగులు ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం వలన విత్తనాలు గులాబీ నుండి ఊద రంగులోకి మారి విత్తనాలపై పెద్ద మచ్చలు ఏర్పడుతాయి . ఈ విత్తనాల రంగు వల్ల ప్రభావం ఏమి ఉండదు కానీ అంకురోత్పత్తి, మొలకల ఉత్పత్తి దెబ్బతినవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, ఈ సేస్కోపోరా కికుచి తెగులు నివారణకు సంబంధించి ఎటువంటి జీవ నియంత్రణమాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేచ్సి మాకు తెలియచేయండి. మీ నుండి వినడానికి ఎదురుచూస్తూ వుంటాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తనాలు అధికంగా రంగు కోల్పోయినట్టువుంటే సీలింద్ర నాసీనులతో విత్తనశుద్ధి చేయండి. దానివలన ఈ తెగులు వ్యాపించకుండా నిరోధించే ఆస్కారం వుంది. మాంకోజెబ్ వంటి శీలింద్ర నాశినులను వాడి లీఫ్ బ్లెయిట్ మరియు కాయలకు సోకే తెగుళ్లను నివారించవచ్చు.

దీనికి కారణమేమిటి?

సెర్కోస్పోరా ఆకు మచ్చలు సెర్కోస్పోరా కుకుచ్చి అనే శీలింధ్రం వలన కలుగుతాయి. ఈ శీలింధ్రం చలి కాలం మొత్తం మొక్కల క్రింద,మట్టిలో, విత్తనాలపై జీవించివుంటుంది. ఎక్కువ తేమ, వెచ్చని వాతావరణం (22-26), గాలి, వర్షాకాలంలో ఈ ఫంగస్ వ్యాధి వ్యాప్తి చెందటానికి అనుకూలంగా ఉంటుంది.ఈ తెగులు కాయలపై, పువ్వులపై వ్యాపించి వాటికి ఊదా రంగు లేదా గోధుమ వర్ణంలో మచ్చలు ఏర్పడేటట్టు చేస్తాయి.


నివారణా చర్యలు

  • తెగులు సోకని విత్తనాలనే వాడండి.
  • పంట మార్పిడి విధానాన్నిపాటించండి.
  • పొలం దున్నడం వలన సూర్య కిరణాలు మట్టిని తాకి ఈ ఫంగిను కొంత వరకు తగ్గించవచ్చు.
  • కోత అనంతరం పొలంలో పంట అవశేషాలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి