సోయాబీన్

రైజోక్తోనియా ఎండు తెగులు

Rhizoctonia solani

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు పసుపు రంగులోకి మారతాయి.
  • క్రమరహిత గోధుమ రంగు గాయాలు వృద్ధి చెందుతాయి.
  • చెట్టు కాండంపై బెరడు తొలగించబడి, చెట్టు పైభాగం చనిపోతుంది.
  • ఆకులు రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
సోయాబీన్
పొగాకు

సోయాబీన్

లక్షణాలు

ముందుగా, గుండ్రని సక్రమంగా లేని వుబ్బినటువంటి ఆకుపచ్చ రంగు మచ్చలు ఎర్రటి గోధుమ రంగు అంచులతో ముదురు ఆకులపై కనిపిస్తాయి. కొన్ని సార్లు ఆకు తొడిమలపై కూడా కనిపిస్తాయి. తరవాతి దశలో ఇవి గోధుమ రంగు లేదా తోలు రంగులోకి లోనికి మారి తొడిమలు, కాడలు మరియు లేత కాయలమీద కనిపించడం మొదలు పెడుతాయి. గోధుమరంగు ఉబ్బెత్తు మచ్చలు కాడలు మరియు ఆకులపై కనబడుతాయి. ఆకుల కలిసిపోయి వాటిపై తెల్లని ప్రత్తి లాంటి ఎదుగుదల కనిపిస్తుంది. తెగులు తీవ్రత అధికమైతే ఆకులు మరియు కాయలు ఎండిపోవడం మరియు రాలిపోవడం జరుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

జీవసంబంధ జీవ సంబంధ ఏజెంట్లు, మొక్క సారాలు మరియు ఎస్సెన్షియల్ నూనెలు ఈ తెగులును నియంత్రించడంలో సహాయపడతాయి. పరాన్న జీవి శీలింద్రం అయిన ట్రైకోడెర్మా హర్డియానం, రైజోక్తోనియా ఎండు తెగులుతో తలపడుతుంది. ఉల్లి, అల్లం మరియు పసుపు సారాలు ఈ ఫంగస్ ఎదుగుదలను తగ్గిస్తాయి. పుదీనా, సిట్రోనెల్ల, పెప్పెర్మింట్. పాల్మరోసా మరియు జెరేనియం యొక్క ఎస్సెన్షియల్ నూనెలు ఈ తెగులును నిరోధించగలవు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శీలింద్ర నాశినులు ఉపయోగించవలసి వస్తే, ఫ్లూక్సాపైరోక్సైడ్ ను పైరాక్సోస్ట్రోబిన్ తో కలిపి వాడితే మంచి ప్రభావం కనిపిస్తుంది. సీజన్ లో రెండు సార్లు కన్నా ఎక్కువ ఈ మందును వాడవద్దు. పంట కోతకు 21 రోజులకన్నా తక్కువ సమయం ఉంటే ఈ పురుగు మందులు వాడొద్దు.

దీనికి కారణమేమిటి?

రైజోక్తానియా సోలని ఫంగస్ మట్టిలోను మరియు పంట అవశేషాలపైన జీవిస్తుంది. వెచ్చని ఉష్ణోగ్రతలలో (25 నుండి 32°C) మరియు అధిక తేమ వున్న సమయాలలో, గాలి మరియు వర్షం ద్వారా ఈ తెగులు చాలా త్వరితంగా వ్యాపిస్తుంది. ఇవి ఆకులను దగ్గరగా అల్లి ఒకరకమైన చాప లాగ మార్చి మొక్కకు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని ఇస్తాయి.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక విత్తన రకాలు నాటండి.
  • తగినంత గాలి వెలుతురు తగిలే విధంగా మొక్కల మధ్య తగినంత దూరం ఉంచండి.
  • వ్యాధి కారక సూక్ష్మ జీవులు వ్యాప్తి చెందకుండా ఉండడానికి నారుమడి మరియు పొలాన్ని జాగ్రత్తగా సిద్ధం చేయండి.
  • కనీసం రెండు సంవత్సరాలవరకు ఈ తెగులు సోకని రకాలతో పంట మార్పిడి చేయండి. ఈ వ్యాధికి ఆతిధ్యమివ్వని మొక్కలతో (మొక్క జొన్న మరియు జొన్న) కనీసం రెండు సంవత్సరాలు పంట మార్పిడి సిఫార్స్ చేయబడింది.
  • కలుపు మొక్కలు అధికంగా పెరగనివ్వకండి( ఈ తెగులుకు ప్రత్యామ్న్యాయ అతిధులుగా కలుపు మొక్కలు పనిచేయవచ్చు).
  • ఇంకా మిగిలివున్న వున్న వ్యాధి కారక సూక్ష్మ జీవులను తొలగించడానికి పొలాన్ని లోతుగా దున్నండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి