మొక్కజొన్న

ఫుసారియం కండె కుళ్ళు

Fusarium verticillioides

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • సహజంగా ఈ తెగులు పంట చివరి దశల్లో మరియు నిల్వ ఉంచే సమయాల్లోనే కలుగుతుంది.
  • కొన్ని గింజలు తెలుపు, గులాబీ రంగు అచ్చులు కలిగి ఉంటాయి.
  • గోధుమ రంగు చారలు వృత్తాకారంలో గింజల పైనుండి కనిపిస్తాయి.
  • పొత్తులు మొత్తం ముడుచుకుపోయి మొత్తం గింజలు కుళ్లిపోతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

ఈ లక్షణాలు మొక్కజొన్న రకాలను, వాతావరణం మరియు తెగులు తీవ్రత బట్టి ఉంటాయి. సహజంగా ఈ తెగులు చివరి దశల్లో మరియు నిల్వ ఉంచే సమయాల్లోనే కలుగుతుంది. కొన్ని గింజలు తెలుపు, గులాబీ రంగు అచ్చులు కలిగి ఉంటాయి. కొన్ని రంగును కూడా కోల్పోతాయి. గోధుమరంగు చారలు వృత్తాకార నమూనాలో గింజల దగ్గర కనిపిస్తాయి. పొత్తు మొత్తం ముడుచుకుపోయి గింజలు కుళ్లిపోతాయి. గింజల దిగుబడి తగ్గిపోతుంది. ఈ ఫంగస్ విషపదార్ధాలు ఉత్పత్తిచేయడం వలన ఈ పొత్తులు ఆహారంగా తీసుకోవడానికి పనిచేయవు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సుడోమోనాస్ ఫ్లోరెసెన్స్ బాక్టీరియా మిశ్రమాన్ని వాడి విత్తనాల చికిత్స మరియు వీటిని పిచికారీ చేయటం ద్వారా కూడా ఈ ఫంగస్ వ్యాపించకుండా నిరోధించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పంట మొదటి దశలలో శీలింద్ర నాశినులను వాడడం వలన ఈ తెగులును నియంత్రించవచ్చు. ఈ తెగులు వలన అధికంగా నష్టం పొత్తులకే ఉంటుంది. శీలింద్ర నాశినులు ఈ తెగులును పూర్తిగా నియంత్రించలేవు. పొత్తులకు నష్టం కలిగించి ఈ ఫంగస్ సోకడానికి కారణమయ్యే కీటకాలను నియంత్రించడానికి ప్రయత్నించండి. ప్రొపికోనజోల్ కలిగిన ఉత్పతులను ఒకలీటర్ నీటికి ఒక మిల్లి లీటర్ కలిపి గింజ గట్టిపడే దశలో వాడడం వలన ఈ ఫంగస్ ను నియంత్రించవచ్చు.

దీనికి కారణమేమిటి?

సహజంగా ఈ తెగులు ఫుస్సరియం వెర్టిసిలియోయిడ్స్ అనే ఫంగస్ వలన కలుగుతుంది. ఇది విత్తనాలు, పంట అవశేషాలు లేదా గడ్డి లాంటి వాటిలో కూడా జీవిస్తుంది. దీని బీజాంశాలు గాలి వల్ల వ్యాపిస్తాయి. ఇది మొదట్లో మొక్కజొన్న పొత్తులోకి వడగళ్ల వానల వలన, గాయాల ద్వారా లేదా పురుగు చేసిన నష్టం వలన చేరుతుంది. గింజల దగ్గర ఇవి గుంపులుగా కనిపిస్తాయి. ఇది మొక్కజొన్నలో అధికంగా కనిపిస్తుంది. ఇది మొలకెత్తి మెల్లగా గింజల ప్రవేశ ప్రాంతాల నుండి లోపలకు చేరి గింజలను వాటి ఆవాసంగా చేసుకుంటుంది లేదా ఇవి ముందు వేర్ల దగ్గరకు చేరి అక్కడ నుండి మెల్లగా మొక్క పైకి చేరతాయి. అనేక రకాల వాతావరణాలలో ఇది మొక్కలను ఆశిస్తుంది కానీ మొక్కలు పూత దశకు చేరిన తరువాత వెచ్చని మరియు పొడి వాతావరణంలో దీని తీవ్రత అధికంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఇది చాల సాధారణ బూజు తెగులు


నివారణా చర్యలు

  • సహనాత్మక మరియు తెగులు నిరోధక రకాలు వాడాలి.
  • స్థానిక వాతావరణానికి అనుగుణమైన మొక్కలనే ఎంచుకోవాలి.
  • ఒక సంవత్సరం పాటు పంట మార్పిడి పద్ధతులు వాడాలి.
  • కోత అనంతరం పొలాన్ని దున్ని పంట అవశేషాల్ని లోతుగా పాతి పెట్టాలి.
  • గింజలను తక్కువ తేమ మరియు ఉష్ణోగ్రతలు వున్న ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి.
  • కోత సమయంలో పొత్తులు దెబ్బతినకుండా చూడాలి.
  • నిల్వ ఉంచే ప్రదేశాలను శుద్ధి చేయాలి.
  • తెగులు సోకిన గింజలను శుద్ధి చేయటం లేదా వీటిని దూరంగా నిల్వ చేసి వాటినుండి విష పదార్ధాలు ఉత్పత్తి కాకుండా చూడండి.
  • వాతావరణ సూచనలను అనుసరించి పంట కోతలు మొదలు పెట్టి నేలపై అధిక తడి వలన గింజలు పాడవ్వకుండా చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి