బొప్పాయి

బొప్పాయిలో నల్లమచ్చ తెగులు

Asperisporium caricae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • క్రింది ఆకుల పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • తరువాత ఈ మచ్చలు పెద్దగా మారి నల్లటి రంగులో పొడిగా ఉబ్బెత్తుగా, నిస్సారమైన లేత గోధుమ రంగుతో మధ్యలో నల్లని భాగంతో పండ్లపైన వృద్ధి చెందుతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

బొప్పాయి

లక్షణాలు

ముందుగా ఆకుల కింది భాగంలో చెదురుమదురు మచ్చలు కనిపిస్తాయి. తరువాత ఈ మచ్చలు పెద్దగా మారి నల్లటి రంగులో పొడిగా ఉబ్బెత్తుగా మారతాయి. ఈ తెగులు సోకినా పండ్లపైన లోతైన మధ్యలో నల్లని ఉబ్బెతైన ఫంగి వున్న సక్రమంగా లేకండా వున్న లేత గోధుమ రంగు మచ్చలు కనపడతాయి. ఈ మచ్చలు 4 మిల్లీమీటర్ల సైజులో ఉంటాయి. తెగులు తరవాత దశలో ఈ మచ్చలు మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. తెగులు తీవ్రత అధికంగా ఉన్నపుడు వ్యాధి సోకిన ఆకులు రాలిపోతాయి, దీని వల్ల మొక్కలు వాటి బలాన్ని కోల్పోతాయి. పండ్లపైన మచ్చలు ఏర్పడినా పండ్ల పైతొక్క కుళ్లిపోయినట్టు కనపడదు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఆస్పెరిస్పోరియం క్యారికే కు ప్రత్యామ్నాయ చికిత్స ఇంకా కనుగొనబడలేదు. మీకు ఏమైనా నివారణ మార్గం తెలిస్తే దయచేసి మాకు తెలియచేయండి. మీ నుండి వినడానికి ఎదురుచూస్తున్నాము. .

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు అధికంగా వున్నప్పుడు డైతియోకార్బమెట్స్ లాంటి సీలింద్ర నాశినులును ఆకులపైనా పిచికారీ చేయడం వలన ఫలితం ఉంటుంది.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు ఆస్పెరిస్పోరియం క్యారికే అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. ఇది ముఖ్యంగా మధ్య అమెరికా, దక్షిణ అమెరికా యొక్క పశ్చిమ భాగాలు మరియు తూర్పు ఆఫ్రికాలో అధికంగా ఉంటుంది. ఆకులు మరియు కాయలు నష్టానికి గురికావచు. ఈ తెగులు లక్షణాలు వాతావరం బట్టి మొక్కల రకాలు బట్టి మారుతూ ఉంటుంది. ఇది కింద ఉన్న ఆకులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. అధికంగా తడి వాతావరణాలలో కలుగుతుంది. బొప్పాయి ఒక్కటే దీనికి సహకరించే పంట కానీ బొప్పాయి మీద కూడా దీని ప్రభావం చాల తక్కువగానే ఉంటుంది. ఈ తెగులు వలన పంట నాణ్యత తగ్గవచ్చు.


నివారణా చర్యలు

  • వ్యాధి సోకిన మొక్కల భాగాలను రాలిన పండ్లను తొలగించి నాశనం చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి