టమాటో

సెప్టోరియా ఆకు మచ్చ

Septoria lycopersici

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న బూడిద గుండ్రపు మచ్చలు, ముదురు గోధుమ అంచులతో, ఆకుల క్రింది భాగంలో కనిపిస్తాయి.
  • మధ్యలో నల్లని చుక్కలు కనిపిస్తాయి.
  • ఆకులు కొద్దిగా పసుపు రంగులోకి మరి ఎండిపోయి రాలిపోతాయి.
  • కాండం మరియు మొగ్గలు కూడా ప్రభావితమవ్వవచ్చు.

లో కూడా చూడవచ్చు


టమాటో

లక్షణాలు

ఈ తెగులు లక్షణాలు ముదురు మొక్కలనుండి లేత మొక్కలకు వ్యాపిస్తాయి. చిన్న, నీట తడిచినట్టు నానిన బూడిద గుండ్రపు మచ్చలు ముదురు గోధుమ రంగు చారలు ఆకుల క్రింది భాగంలో కనిపిస్తాయి. తరవాత దశల్లో మచ్చలు పెద్దగా అయ్యి ఒక చోటకు చేరతాయి మరియు వీటి మధ్యలో నల్లని చుక్కలు కనిపిస్తాయి. ఇటువంటి నమూనా కాండలపై మరియు మొగ్గలపై కనిపిస్తాయి కానీ కాయల మీద చాలా తక్కువగా కనిపిస్తాయి. ఈ తెగులు అధికంగా సోకితే ఆకులు కొద్దిగా పసుపురంగులోకి మారి, ఎండిపోయి రాలి పోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

కాపర్ కలిగిన బోర్డు మిశ్రమం, కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ సల్ఫేట్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ సల్ఫేట్ వంటి శీలింద్ర నాశినులను కూడా వాడవచు. ఏడు నుండి పది రోజుల వ్యవధిలో సీజన్లో ఆఖరి దశ మొత్తం వాడాలి. పురుగుల మందుల డబ్బా పైన ప్రింట్ చేసిన ఆంక్షలను పాటించండి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మాంకోజెబ్. మానెబ్, క్లోరోతలోనిల్ మరియు బెనోమిల్ వంటి శీలింద్ర నాశినులు ఈ సెప్టోరియా ఆకు మచ్చ తెగులును సమర్ధవంతంగా నియంత్రిస్తాయి. పురుగుల మందు డబ్బా పైన వున్న మార్గదర్శకాలను పాటించండి.

దీనికి కారణమేమిటి?

సెప్టోరియా ఆకు మచ్చ ప్రపంచవ్యాప్తంగా సెప్టోరియా లైకోపెర్సీసీ అనే ఫంగస్ వల్ల వ్యాపిస్తుంది. ఈ ఫంగస్ కేవలం టమాటా మరియు బంగాళాదుంప పంటలను మాత్రమే ఆశిస్తాయి. ఈ ఫంగస్ ఎదుగుదలకు 15 నుండి 27°C ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి కానీ 25°C ఉష్ణోగ్రతలు ఈ తెగులుకు మరింత అనుకూలంగా ఉంటాయి. దీని బీజాంశంలు ఓవర్ హెడ్ నీటి సరఫరా వలన, వర్షం , పని చేసే వారి చేతులు, బట్టల వలన కూడా సోకుతుంది. ఇతర సొలనేసియస్ కలుపు మొక్కలపైన మరియు కొద్ది సమయం వరకు మట్టిలోను జీవిస్తుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక రకాలు వాడాలి.
  • ఈ తెగులు సోకిన మొక్కలను తొలగించి నాశనం చేయాలి.
  • పొలంలో సరైన వెంటిలేషన్ వుండేటట్టు చూడండి.
  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి చేయటం మంచిది.
  • పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
  • ఆర్గానిక్ లేదా ప్లాస్టిక్ రక్షణ పూత భూమి నుండి వ్యాపించకుండా వాడవచ్చు.
  • స్ప్రింక్లర్ కానీ ఇతర ఓవర్ హెడ్ నీటి పారుదల సౌకర్యాన్ని కానీ ఉపయోగించవద్దు.
  • పొలంలో వాడిన పరికరాల్ని శుద్ధి చేయాలి.
  • పంట కోతల తర్వాత పంట అవశేషాల్ని తొలగించి నాశనం చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి