ఆలివ్

ఆలివ్ లో ఆకు మచ్చ తెగులు

Venturia oleagina

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల పైభాగంలో క్రమంగా పెరిగే ముదురు, మసి బూజు మచ్చలు,.
  • ప్రతి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం.
  • ఆకులు రాలిపోవడం, పక్క కొమ్మలు చనిపోవడం మరియు పుష్పించక పోవడం సంభవించవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
ఆలివ్

ఆలివ్

లక్షణాలు

వసంత ఋతువు చివరిలో, మసి బూజు మచ్చలు (సాధారణంగా నెమలి మచ్చలు అని పిలుస్తారు) క్రింది భాగాన ఉన్న పందిరిలో ఆకుల పైభాగంలో కనిపిస్తాయి. ఈ మచ్చలు కాండం మరియు పండ్లపై కూడా కనిపిస్తాయి, కానీ సర్వసాధారణంగా ఆకు ఉపరితలంపై ఉంటాయి. ఆకుల దిగువ భాగంలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. సీజన్ పురోగమిస్తున్నకొద్దీ ముదురు మచ్చలు పెరుగుతాయి మరియు ఆకు యొక్క గణనీయమైన భాగాన్ని (0.25 మరియు 1.27 సెం.మీ వ్యాసం) కవర్ చేయవచ్చు.ఈ మచ్చల చుట్టూ క్రమంగా పసుపు రంగు వలయం ఉద్భవించి ఆకు మొత్తం వ్యాపిస్తుంది. ఆకులు రాలిపోవచ్చు మరియు వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న సందర్భాల్లో పక్క కొమ్మలు చనిపోతాయి. పుష్పించడం కూడా విఫలం కావచ్చు, ఫలితంగా పంట ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

శరదృతువులో పండ్లను కోసిన తర్వాత చెట్ల ఆకులపై బోర్డియక్స్ మిశ్రమం వంటి సేంద్రీయ రాగి సమ్మేళనాలను పిచికారీ చేయండి, మరియు తరచుగా వర్షాలు కురుస్తున్నప్పుడు శీతాకాలం చివరలో మళ్లీ పిచికారీ చేయండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. పండ్లను కోసిన తర్వాత చెట్ల ఆకులపై రాగి సమ్మేళనాలతో (ఉదా. కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ ఆక్సిక్లోరైడ్, ట్రైబాసిక్ కాపర్ సల్ఫేట్ మరియు కాపర్ ఆక్సైడ్) పిచికారీ చేయండి మరియు వాతావరణం బాగా తడిగా ఉంటే శీతాకాలంలో మళ్లీ మరొకసారి పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

ఫ్యూసిక్లాడియం ఒలీజినియం అనే శిలీంధ్రం వల్ల లక్షణాలు ఏర్పడతాయి, ఇది లోతట్టు ప్రాంతాలలో లేదా తక్కువ సూర్యరశ్మిని పొందే లేదా మూసి చెట్టు పందిరిని కలిగి ఉన్న పరిసరాలలో వృద్ధి చెందుతుంది. ఇది మొలకెత్తడానికి తేలికపాటి నుండి తక్కువ ఉష్ణోగ్రతలు మరియు ఆకులపై తేమ అవసరం మరియు ఇది సాధారణంగా శరదృతువు, శీతాకాలం మరియు వసంతకాలంలో వర్షాకాలాల్లో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. పొగమంచు, మంచు మరియు అధిక తేమ వ్యాధి వ్యాప్తికి దోహదపడే ముఖ్యమైన కారకాలు. దీనికి విరుద్ధంగా, వేసవిలో వేడి మరియు పొడి పరిస్థితులు ఫంగస్ నిష్క్రియంగా మారడానికి కారణమవుతాయి, అది చివరికి నిద్రాణస్థితికి చేరుకుంటుంది. ఇది మచ్చల రంగు మార్పు ద్వారా సూచించబడుతుంది, ఇవి తెల్లగా మరియు పెంకు లాగ మారుతాయి. ముదురు ఆకుల కంటే లేత ఆకులు సంక్రమణకు గురయ్యే ఎక్కువ అవకాశం ఉంది. దీని ఎదుగుదలకి అనుకూలమైన ఉష్ణోగ్రత పరిధి 14–24 °C, అయితే ఇది 2–27 °C మధ్య కూడా మనుగడ సాగించగలదు. నేలలో పోషకాల లోపాలు లేదా అసమతుల్యత కూడా చెట్లు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలను పెంచుతుంది. ఉదాహరణకు, అధిక నత్రజని మరియు కాల్షియం లోపం చెట్ల రక్షణను బలహీనపరుస్తుందనే భావన ఉంది.


నివారణా చర్యలు

  • వ్యాధి లక్షణాల కోసం తోటను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • నత్రజనిని అధికంగా వాడకండి మరియు కాల్షియం లోపాన్ని నివారించండి.
  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే, వ్యాధి నిరోధక లేదా స్థితిస్థాపకంగా ఉండే రకాలను ఎంచుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి