ద్రాక్ష

బొట్రియోస్ఫేరియా డైబ్యాక్

Botryosphaeriaceae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పొలంలో పనిచేస్తున్నప్పుడు, తరచుగా, గాయపడిన బెరడు భాగాలలో క్యాంకర్లు లేదా చారలు అభివృద్ధి చెందుతాయి.
  • కాండాన్ని అడ్డంగా కోసినప్పుడు చీలిక ఆకారంలో ముదురు గోధుమ రంగు గాయాలు కనపడతాయి.
  • ఇవి చెక్క యొక్క కేంద్ర భాగం వరకు చేరతాయి.
  • రెమ్మలు, ఆకులు మరియు మొగ్గలు కూడా ప్రభావితమవుతాయి.

లో కూడా చూడవచ్చు

6 పంటలు
బాదం
ఆపిల్
ద్రాక్ష
జామ
మరిన్ని

ద్రాక్ష

లక్షణాలు

ఇది ప్రధానంగా చెక్కకు సంబంధించిన వ్యాధి. ఇది కాండంపై క్యాంకర్లు మరియు డైబ్యాక్ లక్షణాలను కలిగిస్తుంది. పొలంలో పనిచేస్తున్నప్పుడు, తరచుగా, గాయపడిన బెరడు భాగాలలో క్యాంకర్లు లేదా చారలు అభివృద్ధి చెందుతాయి, ఉదాహరణకు కత్తిరింపు. కాండాన్ని అడ్డంగా కోసినప్పుడు చీలిక ఆకారంలో ముదురు గోధుమ రంగు గాయాలు కనపడతాయి. ఇవి చెక్క యొక్క కేంద్ర భాగం వరకు చేరతాయి.రెమ్మలు కుంగిపోయిన రూపాన్ని కలిగి ఉంటాయి మరియు డైబ్యాక్ ద్వారా కూడా ప్రభావితమవుతాయి. మొగ్గ అభివృద్ధి ఆలస్యం అవుతుంది లేదా ఆగిపోతుంది, అంతర్గత కణజాలాలు నిర్జీవంగా మారతాయి. అంటుకట్టు వైఫల్యం కూడా ఈ వ్యాధి యొక్క ఒక లక్షణం. ఈ లక్షణాలు ఎల్లప్పుడూ కలిసి ఏర్పడవు మరియు కొన్ని రకాల్లో, ఆకులపై ఈ లక్షణాలు ఏమాత్రం కనపడవు. మొత్తంమీద, ఈ వ్యాధి పంట ఉత్పాదకత, ఆయువు, దిగుబడిని తగ్గించడమే కాక ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ట్రైకోడెర్మా శిలీంధ్రాల జాతుల సూత్రీకరణలను ఉపయోగించడం ద్వారా కొంతవరకు జీవ నియంత్రణను చేరుకోవచ్చు (ఉదాహరణకు టి. స్పెరెల్లమ్ మరియు టి. గామ్సి మిశ్రమం). ఇది కత్తిరింపు గాయాలను, అంటు కట్టే పదార్థం యొక్క బేసల్ చివరలను మరియు సంక్రమణకు ముందు అంటు మొక్కలను రక్షించడంలో సహాయపడుతుంది. కత్తిరింపులో అయ్యే గాయం రక్షణ కోసం అనేక సేంద్రీయ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కత్తిరింపు చేసిన తర్వాత పెద్ద కోతలపై వీలైనంత త్వరగా టెబూకోనజోల్, సైప్రోకోనజోల్, ఫ్లూయిలాజోల్ కలిగిన శిలీంద్రనాశకాలు, పెయింట్స్ మరియు పేస్టును పూయవచు. ఫ్లూడియోక్సోనిల్, ఫ్లూజినామ్, ఫ్లూసిలాజోల్, పెంకోనజోల్, ఐప్రోడియోన్, మైక్లోబుటానిల్ మరియు పైరాక్లోస్ట్రోబిన్ ఈ తెగులును నిరోధించడానికి వాడే ఇతర శిలీంద్ర నాశినులు.

దీనికి కారణమేమిటి?

బొట్రియోస్ఫేరియాసి కుటుంబానికి చెందిన శిలీంధ్ర వ్యాధికారక సమూహం వల్ల వ్యాధి లక్షణాలు సంభవిస్తాయి. ఇవి అనేక రకాల అతిధి మొక్కలకు సంక్రమిస్తాయి కాని సాధారణంగా చెక్కతో వుండే మొక్కలతో సంబంధం కలిగి ఉంటాయి. తెగులు సోకిన తీగలు లేదా చెట్ల బెరడుపై శిలీంధ్రాలు జీవించి ఉండి వసంతకాలంలో బీజాంశాలను ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తాయి. గాలి మరియు వర్షపు తుంపర్ల ద్వారా వీటి బీజాంశం ఇతర తీగలకు వ్యాపిస్తుంది. సహజమైన పగుళ్లు, కత్తిరింపు గాయాలు లేదా కోతలు వంటి గాయాల ద్వారా ఇవి కణజాలంలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ ఇవి 5°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మొలకెత్తుతాయి. ద్రాక్ష యొక్క నిద్రాణ స్థితిలో ప్రారంభ కత్తిరింపు ఈ వ్యాధి సోకే అవకాశాన్ని పెంచుతుంది. క్రమంగా కాండం యొక్క వాస్కులర్ కణజాలంపై దాడి చేసి వేర్లవద్దకు చేరతాయి. దీని ఫలితంగా క్యాంకర్లు, కలప చనిపోవడం మరియు కాండం పైనుండి కిందకు చనిపోవడం (డైబ్యాక్) జరుగుతుంది. కార్క్ ఓక్, పాప్లర్స్, సైప్రెస్ మరియు జునిపెర్స్ దీనికి ప్రత్యామ్నాయ అతిధులు.


నివారణా చర్యలు

  • తెగులు సోకే అవకాశం తక్కువ ఉన్న రకాలను పెంచండి.
  • ద్రాక్షతోటలో మొక్కల అవశేషాలు మరియు చనిపోయిన కలపను తొలగించండి.
  • తడి వాతావరణంలో కత్తిరింపును నివారించి గాయాల సంఖ్యను తగ్గించండి.
  • ఎండిపోయిన భాగాలను కనుగొని కొమ్మలు లేదా మొత్తం తీగలను తొలగించండి.
  • బీజాంశం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకోవడాన్ని నివారించడానికి నిద్రావస్థ తర్వాత కత్తిరించండి.
  • లక్షణాల తీవ్రతను తగ్గించడానికి అదనపు నీటిపారుదల సహాయపడుతుంది కాని పైనుండి నీరుపెట్టడం మానుకోండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి