ద్రాక్ష

కోణాకారపు ఆకు మచ్చ

Mycosphaerella angulata

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై లేత పసుపు మచ్చలు ఏర్పడతాయి.
  • మచ్చల మధ్యన ఒక పద్దతిలో లేని గోధుమ రంగు మచ్చలు ఏరాడతాయి.
  • ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి.
  • ఆకులు రాలిపోవడం వలన మొక్కల బలాన్ని తగ్గుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

ఈ వ్యాధికారక సూక్ష్మ జీవులు ఆకులపై మాత్రమే దాడి చేస్తాయి. వ్యాధి యొక్క ప్రారంభ దశలలో, తెగులు సోకిన మొక్కల యొక్క ఆకులు మందమైన, నిర్జీవమైన మచ్చలను వృద్ధి చేస్తాయి. దీనిని ఎక్కువగా ఆకు బ్లేడు కిందిభాగంలో చూడవచ్చు. సీజన్లో వీటి పరిమాణం పెరిగేకొద్దీ, పసుపు మచ్చల మధ్యలో ఒక పద్దతిలో లేని గోధుమ రంగు మచ్చలు వృద్ధి చెందుడం వలన, వాటికి కోణాకారాన్ని కల్పిస్తాయి దానితో అవి మరింత కనిపించేలా చేస్తాయి. ఈ లక్షణాలు మిగిలిన ఆకు మొత్తం విస్తరించవచ్చు. చివరికి ఆకు పసుపు రంగులోకి మారి చనిపోతుంది. వ్యాధి పెరుగుతున్న కొద్దీ, ఇది సీజన్ చివరినాటికి ఆకులు విస్తృతంగా రాలిపోవడానికి కారణమవుతుంది. ఆకులు తక్కువగా ఉండడం వలన మొక్కల సత్తువ మరియు దిగుబడి తగ్గుతుంది, అలాగే ద్రాక్ష పండ్ల నాణ్యత తక్కువగా ఉంటుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, మైకోస్ఫెరెల్లా అంగులాటాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ చికిత్స గురించి మాకు తెలియదు. ఈ వ్యాధితో పోరాడటానికి సహాయపడే పద్దతి ఏదైనా మీకు తెలిస్తే దయచేసి మమల్ని సంప్రదించండి. మీ నుండి తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నాము.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సాంప్రదాయిక శిలీంద్ర నాశినులను సకాలంలో వాడటం ద్వారా కోణాకారపు ఆకు మచ్చను నియంత్రించవచ్చు. సీజన్ ప్రారంభంలో శిలీంద్ర నాశినులను పదే పదే వాడడం సంక్రమణను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం.

దీనికి కారణమేమిటి?

మైకోస్ఫెరెల్లా అంగులాటా అనే ఫంగల్ ప్లాంట్ వ్యాధికారక సూక్ష్మ జీవుల వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇది మస్కాడిన్ ద్రాక్ష (విటిస్ రోటుండిఫోలియా) యొక్క ముఖ్యమైన వ్యాధి, కానీ ఇతర ద్రాక్ష రకాలను కూడా ప్రభావితం చేస్తుంది. బీజాంశం గాలి మరియు నీటి తుంపర్ల ద్వారా ఇతర ఆకులు మరియు మొక్కలకు వ్యాపిస్తుంది. ఇవి ఆకు కణజాలంలోకి ప్రవేశించి, ఆకుల మీద ఉన్న సహజ రంధ్రాల ద్వారా లేదా గాయాల ద్వారా సంక్రమిస్తాయి. తెగులు సోకిన ఆకులు పేలవమైన కిరణజన్య సంయోగక్రియను కలిగి ఉంటాయి, దీని ఫలితంగా ఆకు నష్టం, మొక్కలో పేలవమైన సత్తువ మరియు ద్రాక్షను సూర్యరశ్మికి కమిలిపోయేటట్టు చేస్తుంది. పండు తయారీకి ముందు ఇది జరిగితే, ఇది ద్రాక్ష అభివృద్ధిని నెమ్మదింపజేస్తుంది లేదా ఆపవచ్చు. వ్యాధికారక సూక్ష్మ జీవులు వెచ్చని, తడి వాతావారణంలో ముఖ్యంగా ఎదుగుదల ప్రారంభం దశలో వృద్ధి చెందుతాయి.


నివారణా చర్యలు

  • మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే, తెగులును తట్టుకునే లేదా తెగులు నిరోధక ద్రాక్ష రకాలను వాడండి.
  • వ్యాధి సంకేతాల కోసం ద్రాక్షతోటను తరచూ తనిఖీ చేయండి.
  • మంచి ఎరువుల కార్యక్రమం ద్వారా పంటను ఆరోగ్యంగా ఉంచండి.
  • సీజన్ చివర్లో అధికంగా ఎరువులను వాడకండి.
  • ద్రాక్షతోటల చుట్టూ ఉన్న అడవి మస్కాడిన్ ద్రాక్ష మొక్కలను తొలగించండి.
  • పై ఆకులను కత్తిరించండి.
  • ఇది ఆకులకు మంచి గాలిని అందిస్తుంది.
  • పంట కోత తర్వాత మొక్కల అవశేషాలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి