ద్రాక్ష

ద్రాక్షలో పక్షి కన్ను తెగులు

Elsinoe ampelina

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • లేత ఆకులపై చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • పెద్ద పరిమాణంలో బూడిద రంగు మరియు పొడి బారిన అతుకుల వంటి గుర్తులు.
  • ఈ అతుకులు కనుమరుగయ్యి ఆకులపై రంద్రాలను ఏర్పరుస్తాయి.
  • కాండాలు కొమ్మలు కూడా ప్రభావితమవుతాయి.
  • పండుపై గోధుమ రంగు అంచులతో కూడిన బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

ఈ ఫంగస్ తీగలు, ఆకులు, చిగుర్లు, కాండం మరియు టెండ్రిల్స్ వంటి అన్ని ఆకుపచ్చ భాగాలపై దాడి చేస్తుంది. అయినప్పటికీ లేత, వేగంగా పెరుగుతున్న కణజాలం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఆకుల పైపొరపై చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు పెరుగుతాయి. ఇవి విస్తరించే కొద్ది క్రమరహితంగా మారి వాటి మధ్య భాగం క్రమంగా బూడిదరంగు నిర్జీవ మచ్చగా మారుతుంది. చివరికి, చనిపోయిన కణజాలం కనుమరుగయ్యి తుపాకి గుల్ల దెబ్బల వంటి రంద్రాలను ఏర్పరుస్తుంది. కాండం మరియు రెమ్మలపై ఒకే రకమైన మచ్చలు మరియు గాయాలు ఏర్పడతాయి మరియు వాటి చుట్టూ నడికట్టు లాగ ఏర్పడడం వలన పగుళ్లు ఏర్పడి మొక్కలు పైనుండి కిందకు చనిపోతాయి. పండ్లపై చిన్న చిన్న గుండ్రని, ఊదా రంగు మచ్చలు కూడా వృద్ధి చెందుతాయి. ఇవి క్రమంగా విస్తరించి, గోధుమ రంగు అంచులతో నొక్కినట్టున్న బూడిదరంగు మచ్చలుగా మారతాయి. ఇవి పైపొరను కప్పేసినప్పుడు బెర్రీలు వాడిపోయి గుత్తిపైన పడిపోతాయి లేదా మమ్మీ లాగ అవుతాయి. ఈ విలక్షణమైన మచ్చలు బూడిద రంగు మధ్యభాగంతో ఉండడం వలన దీనికి పక్షి కన్ను కుళ్ళు తెగులు అనే పేరు వచ్చింది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మొగ్గ విరామానికి ముందు, వసంత ఋతువు ప్రారంభంలో ద్రవ్యరూపంలో సున్నం సల్ఫర్ లేదా రాగి పిచికారీలా వాడకం, వ్యాధికారక సూక్ష్మ జీవుల అధిక సంభవం నివారించడానికి ఉపయోగించబడింది. సేంద్రీయ ధృవీకరణ కార్యక్రమంలోనే శిలీంద్ర నాశినులు అనుమతించబడతాయని నిర్ధారించుకోండి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సకాలంలో రక్షిత శిలీంద్ర నాశినులను పిచికారీ చేయడంతో పాటు మంచి సంప్రదాయ సాగు పద్ధతులను అనుసరిస్తే పక్షి కన్ను తెగులును నియంత్రించవచ్చు. మొగ్గలు వేసినప్పుడు ద్రవ్యరూపంలో సున్నం సల్ఫర్ లేదా బోర్డియక్స్ మిశ్రమాన్ని పిచికారీ చేయడం వలన పక్షి కన్ను తెగులు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కప్తాన్, క్లోరోతలోనిల్ మరియు మాంకోజెబ్ లు తెగులు కొత్త పెరుగుదలను నివారించడం మరియు పండ్లను రక్షించడంలో సహాయపడతాయి. మొగ్గ వేసినప్పటి నుండి కాయకు రంగు రావడం మొదలయ్యే వరకు ప్రతి 2 వారాలకు ఒకసారి పిచికారీ చేయండి.

దీనికి కారణమేమిటి?

ఎల్సినో ఆంపిలినా అనే ఫంగస్ వల్ల లక్షణాలు వస్తాయి. ఇది రెమ్మలపై వున్న శిలీంధ్ర నిర్మాణాలలో మరియు తెగులు సోకిన తీగలపై చలికాలం అంతా జీవిస్తుంది. వసంతకాలంలో ఇది బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి వర్షపు తుంపర్ల వలన చెదరకొట్టబడతాయి. బీజాంశాలు గాలి మరియు వర్షం వలన లేత, పెరుగుతున్న ఆకులు లేదా రెమ్మలపై చేరతాయి. కణజాలం ఎక్కువ కాలం తడితో ఉండడం (12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ) అలాగే 2 నుండి 32°C వరకు ఉష్ణోగ్రతలు బీజాంశాల ఉత్పత్తి మరియు అంకురోత్పత్తికి అనుకూలంగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత మరియు తేమ వాతావరణంలో ఈ తెగులు వేగంగా సంక్రమించడమే కాక లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. చల్లని వాతావరణం ఫంగస్ పెరుగుదలను తగ్గిస్తుంది. ఆకులు రాలిపోవడం, నేరుగా పండ్లకు నష్టం వాటిల్లడం వలన దిగుబడి మరియు నాణ్యత మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.


నివారణా చర్యలు

  • తగిన సూర్యరశ్మి మరియు మంచి గాలి ప్రసరణ వున్న పొలాన్ని ఎంచుకోండి.
  • అందుబాటులో ఉంటే ఈ తెగులును తట్టుకునే రకాలను ఉపయోగించండి.
  • తీగల మధ్య దూరం అధికంగా ఉండేలా చూసుకోండి.
  • స్వదేశీ ద్రాక్ష కోసం, తెగులు సోకిన చెత్తను కప్పి పెట్టడానికి ఆకులను లేదా బెరడును కాని ఉపయోగించండి.
  • ద్రాక్షతోటకు దగ్గర్లో ఏదైనా అడవి ద్రాక్ష పెరుగుతుంటే దానికి తొలగించండి.
  • తీగలను పర్యవేక్షించి తెగులు లక్షణాలు కనిపించిన పండ్లు లేదా మొక్కల భాగాలను తొలగించండి.
  • శీతాకాలం ప్రారంభంలో నిద్రాణస్థితిలో వున్న తీగలను కత్తిరించండి.
  • ద్రాక్షతోట నుండి మొక్కల అవశేషాలను తొలగించండి.
  • పొలాన్ని దున్ని మొక్కల అవశేషాలు మరియు రాలిన కాయలను పాతిపెట్టండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి