చిరుధాన్యాలు

పైరికులేరియా ఆకు మచ్చ తెగులు

Magnaporthe oryzae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • బూడిద రంగు, నీటిలో నానినట్టు వున్న మచ్చలు ఏర్పడతాయి.
  • కొన్నాళ్లకు ఇవి పెద్దవై అయ్యి నిర్జీవంగా మారిపోతాయి.
  • ఆకులు పత్రహరితాన్ని కోల్పోవడం మరియు ముందుగానే ఆకులు చనిపోవడం జరుగుతుంది.
  • తెగులు విస్తరిస్తున్న కొలదీ కాండం కూడా దెబ్బతిని కుప్పకూలిపోవచ్చు.

లో కూడా చూడవచ్చు


చిరుధాన్యాలు

లక్షణాలు

ఆకులపైన నీటిలో నానినట్టు వున్న మచ్చలుగా ఈ తెగులు లక్షణాలు బహిర్గతమౌతాయి.తరువాత ఇవి విస్తరించి మధ్యలో బూడిద రంగుతో నిర్జీవమైన మచ్చలుగా( గోధుమ రంగు) మారతాయి. ఈ మచ్చలు సుమారు 2.5 మిల్లీమీటర్ల వ్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో లేదా వజ్రపు ఆకారంలో ఉంటాయి. ఈ మచ్చలు చుట్టూ తరచుగా పసుపు రంగు పాలిపోయినట్టు వున్న వలయాలు ఏర్పడతాయి. ఆకు కాడలకు సమీపంలో కాండం కూడా దెబ్బతినవచ్చు మరియు తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు కుప్పకూలిపోవచ్చు. కంకులు స్థిరత్వం కోల్పోతాయి. ఇవి వృద్ధి చెందినప్పటికీ గింజలు ముడుతలు పడి ఉంటాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు పత్రహరితం అధిక మొత్తంలో కోల్పోయి లేత ఆకులు ముందుగానే ఎండిపోతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

నారుమడిలో 8 నుండి 10 రోజులకు ఒకసారి బోర్డియక్స్ మిశ్రమం వాడకం సిఫార్స్ చేయబడినది. పొలంలో ప్రతి 14 రోజులకు ఒకసారి ఈ మిశ్రమాన్ని వాడాలి. మీద వద్ద తెగులు సంక్రమించడం వలన అధిక మొత్తంలో నష్టం కలగడం వలన ఈ తెగులును తగ్గించడానికి కంకులు తయారవ్వకముందే ఈ మిశ్రమాన్ని వాడడం చాలా ముఖ్యం. వెల్లుల్లి రెబ్బ కాషాయం, వేప నూనె కాషాయం లేదా హినోసన్ ( ఆర్గానోఫాస్ఫెట్) లని పిచికారి చేసి ఈ ఫంగస్ ను అణిచివేయవచు. విత్తనాలను ఆర్గానోమెర్క్యురియల్స్ తో శుద్ధి చేయడం వలన ఈ ఫంగస్ తీవ్రతను తగ్గించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ట్రైసైక్లాజోల్ కలిగిన శీలింద్ర నాశినులు ఈ ఫంగస్ ను నాశనం చేయడంలో మంచి ప్రభావం చూపుతాయి. ప్రోక్లొరాజ్ వాడడం వలన కూడా ఈ ఫంగస్ ను కొంతవరకు తగ్గించవచ్చు. ఈ ఫంగస్ ను నియంత్రించడానికి మరియు అధిక దిగుబడులు సాధించడానికి పుష్పీకరణ మొదలైనప్పటినుండి వారానికి మూడుసార్లు వీటిని పిచికారీ చేయాలి.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు మాగ్నాపోర్తే ఒరేజాయ్ అనే ఫంగస్ వలన ఏర్పడతాయి. ఈ ఫంగస్ పంట అవశేషాలు లేదా ముడుతలు పడిన ధాన్యపు గింజలలో జీవించి ఉంటాయి. ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలుగా వుండే కలుపు మొక్కలు లేదా ఇతర ధాన్యపు పంటల ద్వారా ఇవి ప్రధానంగా గాలిలో వుండే బీజాంశాల ద్వారా వ్యాపిస్తాయి. తెగులు సోకిన విత్తనాల ద్వారా నారుమడిలో మొక్కలకు ఈ తెగులు సంక్రమిస్తుంది. తరువాత ఇది పొలంలో వ్యాపిస్తుంది. అధికంగా తేమ మరియు వెచ్చని ఉష్ణోగ్రతలు వున్న పరిస్థితులు ఈ ఫంగస్ కు చాలా అనుకూలంగా వుండి బీజాంశాలు కలిగి వున్న ఆలివ్ బూడిదరంగు ఎదుగుదల కనిపిస్తుంది. 25°C వద్ద అంకురోత్పత్తి, బీజాంశాల నిర్మాణం మరియు అతిధి కణాలపైన దాడి చాలా అధికంగా ఉంటుంది. తెగులు సోకిన మొక్కల ధాన్యంలో ఈ ఫంగస్ ఉండడం వలన తరువాత సీజన్లో ఈ విత్తనాలను వాడరాదు.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన మూలాలనుండి లేదా ఆరోగ్యకరమైన మొక్కలనుండి సేకరించిన విత్తనాలను మాత్రమే ఉపయోగించండి.
  • నారుమడిని పొలాన్ని ఈ తెగులు లక్షణాలకు క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • తెగులు సోకిన మొక్కలను వెంటనే పొలంలోనుండి తొలగించి నాశనం చేయండి.
  • పంట కోతల అనంతరం పొలాన్ని బాగా దున్ని పంట అవశేషాలను నాశనం చేయండి.
  • పొలంలో మరియు పొలం చుట్టూ ప్రక్కల కలుపు మొక్కలను ఇతర ప్రత్యామ్న్యాయ అతిధులను నియంత్రించండి.
  • తెగులు సోకిన పొలంలో విత్తనాలను వేరొక పొలంలో ఉపయోగించవద్దు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి