శనగలు & సెనగ పప్పు

ఆస్కోచ్యాట ఎండు తెగులు

Didymella rabiei

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • నీటిలో నానినట్టు వున్న మచ్చలు ఆకులు, కాండం లేదా కాయలపైన కనపడతాయి.
  • తరువాత ఇవి గోధుమ రంగులోకి మారతాయి.
  • ఒక స్వాభావికమైన ముదురు కేంద్రీకృతమైన మచ్చలు ఆకులపైన ఏర్పడతాయి.
  • పొలంలో ఎండిపోయిన మొక్కల ప్రాంతాలను దూరం నుండి చూడవచ్చు.

లో కూడా చూడవచ్చు


శనగలు & సెనగ పప్పు

లక్షణాలు

పెద్ద మొక్కలలో ఈ తెగులు ముందుగా ఆకుల పైన పాలిపోయిన నీటిలో నానినట్టు వుండే మచ్చల రూపంలో కనపడుతుంది. కాలక్రమేణా ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి మధ్య భాగంలో చిన్న చిన్న నల్లని చుక్కలు వృద్ధి చెంది ముదురు అంచులతో కేంద్రీకృతమైన వలయాల వలె మారతాయి. నల్లని మచ్చలతో కూడిన పొడవైన మరియు కోలాకారంలో వున్న గోధుమ రంగు మచ్చలు కాండంపైన కూడా ఏర్పడవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో ఇవి ఒక పట్టీ వలే ఏర్పడి ప్రతికూల పరిస్థితుల్లో ముక్కలైపోతాయి. కాయలపైన ఏర్పడే మచ్చలు మరియు ఆకులపైన ఏర్పడే మచ్చలు ఒకేవిధంగా ఉంటాయి. మొత్తం మొక్క అంతా ఎండిపోవచ్చు. పొలంలో గోధుమ రంగు ప్రాంతంగా కొన్ని సార్లు ఇది కనపడుతుంది. విత్తనాలు కూడా ఈ తెగులు బారిన పడవచ్చు మరియు ఈ తెగులును మొలకలను కూడా సంక్రమింప చేయచ్చు. దీని వలన కాండం మొదలు వద్ద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, ఈ ఆస్కోచ్యాట రబీఈ ను నియన్తరించడానికి ఎటువంటి ప్రత్యామ్న్యాయ చికిత్స మాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలియచేయండి. మీ నుండి వినడానికి మేము ఎదురు చూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నాటే ముందు తీరం లేదా తీరం + తియాబెండజోల్ తో విత్తన శుద్ధి చేయవచ్చు. ఈ తెగులు వృద్ధి చెందకుండా పుష్పించే దశకు ముందు నివారణ శీలింద్ర నాశినులను ( ఉదాహరణకు క్లొరాన్తలోనిల్) ను ఉపయోగించవచ్చు. ఒక్క సారి ఈ తెగులును గుర్తించిన తర్వాత ఆకులపై పిచికారి చేసే శీలింద్ర నాశినులను ఒక క్రమ పద్థతిలో ఒకదాని తర్వాత మరొకటి ఉపయోగించండి ( బొస్కాలిడ్, మాంకోజెబ్, పైరాక్లొస్ట్రోబిన్ + ఫ్లూక్సాపైరోక్సిడ్ లేదా ట్రియాజోలిన్థియోన్ ఉత్పత్తులు). దిగుబడిలో అధిక నష్టం కలగకుండా ఉండడానికి ఎదుగుదల దశ మొత్తం ఈ మందులను ఉపయోగించవలసి ఉంటుంది.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు ఇంతకు ముందు ఆస్కోచ్యాట రబీఈ అని పిలువబడే డిడిమెళ్ళ రబిఈ అనే ఫంగస్ కారణంగా కలుగుతాయి. దీనివల్లనే ఈ తెగులును ఈ పేరు వచ్చింది. పంట అవశేషాలపై సంవత్సరాల తరబడి జీవించి ఉండగలదు. అనుకూల పరిస్థితుల్లో ఇది బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ఈ బీజాంశాలు గాలి మరియు వర్షం వలన వ్యాప్తి చెందుతాయి. కొన్ని సార్లు ఇవి కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వ్యాపిస్తాయి. చల్లని మరియు తడి వాతావరణం, అధిక తేమ, ఉదయం పూట పొగ మంచు మరియు అధిక సమయం ఆకులపైన తడి( రెండు గంటలు లేదా అంతా కన్నా ఎక్కువ సమయం) ఈ తెగులు విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ తెగులు విస్తృత ఉష్ణోగ్రతల పరిధిలో (5-30°C) వృద్ధి చెందగలదు. కానీ 15 నుండి 25°C మధ్యన ఉష్ణోగ్రతలు ఈ ఫంగస్ వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఎదిగే దశలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే అనేక సార్లు ఈ సంక్రమణ జరగవచ్చు.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే మంచి తెగులు నిరోధకత కలిగిన రకాలను ఉపయోగించండి.
  • ధ్రువీకరించిన తెగుళ్లు లేని విత్తనాలను ఉపయోగించండి.
  • ప్రత్యామ్న్యాయంగా మంచి ఆరోగ్యంగా వున్న పొలంలోనుండి సేకరించిన విత్తనాలను వాడండి.
  • సిఫార్స్ చేసిన విత్తన మోతాదులను వాడండి.
  • సీజన్లో ఆలస్యంగా నాటడం ద్వారా ఈ తెగులు యొక్క అత్యధిక ప్రభావానికి మొక్కలు లోనవకుండా నివారించండి.
  • ఈ తెగులు లక్షణాల కొరకు పొలాన్ని తరుచుగా క్రమం తప్పకుండ గమనిస్తూ వుండండి.
  • పొలంలో మరియు పొలం చుట్టూ ప్రక్కల స్వచ్చందంగా వచ్చిన చెత్త మొక్కలు మరియు కలుపు మొక్కలను తొలగించండి.
  • ఈ తెగులు వలన దిగుబడి ప్రభావితం కాకుండా ఉండడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంట కోతలు పూర్తి చేయండి.
  • మంచి పరిశుభ్రత పద్దతులను పాటించండి.
  • ఉదాహరణకు, పొలాన్ని తనిఖీ చేసిన తర్వాత బూట్లు మరియు బట్టలను కడుక్కోవడం.
  • మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అదే పొలంలో బటాణీ పంటను వేయండి( పంట మార్పిడి).

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి