సోయాబీన్

సోయాబీన్ లో గోధుమ రంగు మచ్చ తెగులు

Septoria glycines

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ముదురు ఆకులపై పసుపు అంచులతో ఎరుపు-గోధుమ మచ్చలు పైన కనిపిస్తాయి.
  • మచ్చలు ఒక దగ్గరికి చేరి చుట్టూ పసుపు రంగుతో కూడిన ఒక పెద్ద గోధుమ రంగు మచ్చ లాగ ఆకృతిను సంచరించుకుంటుంది.
  • ఆకు మొత్తం గోధుమ రంగు తుప్పు మరియు పసుపు రంగులోకి మారి ముందుగానే రాలిపోవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

మొదటి లక్షణాలు పాత ఆకుల పైన కనిపించవచ్చు. వేడి మరియు వర్షాభావ వాతావరణం వీటికి సహకరిస్తాయి, ఆకుల నుండి మొక్క పైకి వ్యాపించటానికి. ఎరుపు-గోధుమ మచ్చలు పసుపు సరాలతో పాత ఆకులపైన కనిపిస్తాయి. మచ్చలు ఒక చోటకు చేరి ఒక పెద్ద గోధుమ రంగు మచ్చ లాగ మారవచ్చు. వ్యాధి పెరిగే కొద్దీ ఈ మచ్చలు పెరిగి ఒక చోటకు చేరి పెద్ద మచ్చలుగా మారుతాయి. ఆకు మొత్తం గోధుమ మరియు పసుపు రంగులోకి మారి రాలిపోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

తెగులు మొదటిదశలో వున్నప్పుడు, దీర్ఘకాలం వర్షపు వాతావరణం వున్న పరిస్థితుల్లో, బాసిల్లస్ సబ్టిలస్ తో కూడిన ఉత్పత్తులను వాడండి.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. గోధుమమచ్చ తెగులు వలన కలిగే నష్టం చాల తక్కువ. అందువలన పురుగుల మందులు సిఫార్స్ చేయరు. ముందు జాగ్రత్త కోసం ఫంగిసైడ్ తో విత్తన శుద్ధి చేయడం మంచిది. వర్షాకాలంలో అజాక్సిస్ట్రోబిన్, క్లోరోతలో నిల్, మాంకోజెబ్ మరియు పైరాక్లోస్ట్రోబిన్ లాంటి శీలింద్ర నాశినులను వాడండి.

దీనికి కారణమేమిటి?

గోధుమ రంగు మచ్చ తెగులు అనేది సెప్టోరియా గ్లైసినెస్ అనే ఫంగస్ వలన కలుగుతుంది. చలికాలంలో ఈ వైరస్ మొక్కల అవశేషాలపైన మట్టిలో వున్న విత్తనాలపైన బ్రతుకుతుంది. వర్షం పాడినప్పుడు ఈ వైరస్ యొక్క స్పోర్స్ ఆకులపైకి చేరతాయి. ఆకులు ఎక్కువగా తేమగా ఉంటే ఈ తెగులు మరింతగా అభివృద్ధి చెందుతుంది. 25 డిగ్రీల ఉష్ణోగ్రత, వర్షాకాలం, తేమ మరియు తక్కువ వేడి వాతావరణం ఈ తెగులు బాగా పెరగడంలో సహకరిస్తుంది. కానీ పొడి మరియు వేడి వాతావరణం ఈ తెగులును విస్తరి చకుండా ఆపుతుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక వంగడాలను ఎంచుకోండి.
  • పంట మార్పిడి పద్ధతులు (మొక్కజొన్న, తృణధాన్యాలు) పాటించండి.
  • పంట కోత తరువాత పొలాల్ని దున్ని మొక్కల అవశేషాల్ని తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి