ఇతరములు

ధాన్యపు పంటలలో కన్ను మచ్చ తెగులు

Oculimacula yallundae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ముదురు గోధుమరంగు నుంచి ఆకుపచ్చని గోధుమ రంగులో ఉండే దీర్ఘవృత్తాకార కన్ను ఆకారంలో మచ్చలు కాండము మరియు ఆకు తొడుగు అడుగు భాగములో కనపడతాయి.
  • ఈ మచ్చలు అన్ని కలసి కాండం చుట్టూ బిగిసిపోయి పైకి నీరు మరియు పోషకాలు పోవడాన్ని తగ్గించి వేస్తాయి.
  • ఈ తెగులు విస్తరించే కొలదీ అది కాండాన్ని బలహీనపరచి మొక్కలు పడిపోయేటట్టు చేస్తాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
బార్లీ
గోధుమ

ఇతరములు

లక్షణాలు

మొలకల దశలో అంటువ్యాధులు మొక్కలు చనిపోవడానికి ( డై బ్యాక్) దారితీస్తుంది. గుండ్రటి కంటి ఆకారపు గాయాలు కాండం అడుగు వద్ద కనిపిస్తాయి. ఇవి గడ్డి రంగు కేంద్రాలను కలిగి ఉంటాయి మరియు ఆకుపచ్చ నుండి ముదురు గోధుమరంగు రింగులు చుట్టూ వలయాలుగా ఉంటాయి. అనేక సందర్భాలలో కంటి మచ్చలు మట్టి సమీపంలో ఆకు తొడుగు వద్ద ఏర్పడతాయి. ఈ గాయాలు అన్నీ కలసి కాండాన్ని చుట్టూ బిగించి వేస్తాయి. దీనివలన నీరు మరియు పోషకాలు మొక్కల పైభాగానికి చేరడం కష్టం అయ్యి తెల్లని వాలిపోయిన కంకులు ఏర్పడతాయి. దీనివలన దిగుబడి తగ్గిపోతుంది. మొక్కల వేర్లు ఈ “కంటి మచ్చ” కు ప్రభావితము కావు మరియు పైన వివరించబడిన వేర్లపై కనపడవు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, మాకు ఒక్యులిమ్యాకుల యాల్లుండే కు ఎటువంటి ప్రత్యామ్నాయ చికిత్స తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీ నుండి వినడానికి ఎదురు చూస్తున్నాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. చాలా శిలీంద్ర నాశినులు ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి ప్రమాదకరం కాబట్టి ఉపయోగం కోసం సిఫార్సు చేయబడవు. అత్యంత ప్రభావవంతమైన శిలీంద్ర నాశినులు బొస్కాలిడ్ మరియు ట్రయాజోల్ ప్రొథియోకొనాజోల్ ఆధారితమై ఉంటాయి. సిప్రోడినిల్ కూడా ప్రభావవంతమైనది, కానీ ఇతర తృణధాన్యాల తెగుళ్ల నియంత్రణపై తక్కువ ప్రభావం కలిగివుంటుంది.

దీనికి కారణమేమిటి?

దీర్ఘకాలం (2 సంవత్సరాలు లేదా ఎక్కువ) పాటు నేలలో ఉండే పంట అవశేషాలలో జీవించి ఉండగల బూజు తెగులు ఫంగస్ ఒక్యులిమ్యాకుల యాల్లుండే వలన ఈ తెగులు సంక్రమిస్తుంది. ప్రాధమిక సంక్రమణం, వసంతకాలంలో అనుకూలమైన పరిస్థితులలో ఈ బీజాంశములు వర్షం లేదా గాలుల వలన ఈ మొక్కల అవశేషాల నుండి వచ్చి పంటపై పడతాయి. మొక్క అడుగు ప్రాంతాలు మాత్రమే బూజు తెగులు బారిన ఉంటాయి. తేలికపాటి మరియు తేమ వాతావరణ పరిస్థితులు (మంచు బిందువులు, మంచు), మరియు శరదృతువు మరియు వసంత ఋతువులలో తరచుగా వర్షాలు బూజు తెగులు మరియు సంక్రమణ విధానంలో జీవిత చక్రానికి మద్దతుగా ఉంటాయి. ఒకసారి ఈ మచ్చలు కాండంలోనికి ప్రవేశించిన తరువాత అధిక ఉష్ణోగ్రతలు ఈ తెగులు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. ఇతర పంటలైన రై మరియు ఓట్లు తో పంట మార్పిడి చేయడం వలన ఇది విస్తరించడాన్ని ప్రోత్సహించి ఈ తెగులు సంక్రమించే అవకాశం ఉంటుంది


నివారణా చర్యలు

  • స్థిరమైన మరియు తెగులు నిరోధక రకాలను పెంచండి.
  • విత్తనాలను భూమిలో బాగా లోతుకు వేయవద్దు.
  • సీజన్లో ముందుగా విత్తనాలను నాటవదు.
  • మొక్కల మధ్యన సరైన అంతరం పాటించండి.
  • పొలంలో సరైన పద్దతిలో గాళ్ళను ఏర్పాటుచేసుకోండి.
  • ఈ తెగులు సోకని ఇతర మొక్కలతో పంట మార్పిడి చేయండి.
  • పంట కోత తరువాత పంట కొయ్యలను తొలగించి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి