బార్లీ

రములారియా ఆకు మచ్చ తెగులు

Ramularia collo-cygni

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • సీజన్ చివరిలో ఆకు మధ్య ఈనె మరియు తొడుగులపై గోధుమ రంగు దీర్ఘచతురస్రాకార మచ్చలు కనిపిస్తాయి.
  • వ్యాధి తరువాతి దశల్లో ఈ మచ్చలుఒకదానితో మరొకటి కలిసిపోతాయి మరియు పెద్ద ప్రాంతాలు లేదా కణజాలం నిర్జీవంగా మారతాయి.
  • ఆకుపచ్చ ఆకు కణజాలం దెబ్బతినడం వల్ల అకాల క్షీణత మరియు దిగుబడి నష్టాలు సంభవించవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
బార్లీ

బార్లీ

లక్షణాలు

మొక్కల ఎదుగుదల ప్రారంభంలోనే ఫంగస్ సంక్రమణ సంభవించవచ్చు, అయితే మొదటి లక్షణాలు సీజన్ చివరిలో మాత్రమే కనిపిస్తాయి. వ్యాధి యొక్క ప్రారంభ దశలో, చిన్న గోధుమ రంగు క్రమరహిత "మిరియాల పరిమాణపు మచ్చలు" ఆకు ఈనెల మధ్య లేదా తొడుగులపై కనిపిస్తాయి. తరువాత, ఈ మచ్చలు 1 నుండి 3 మిమీ పరిమాణంతో దీర్ఘచతురస్రాకార, ఎరుపు-గోధుమ నిర్జీవ మచ్చలుగా విస్తరించి వృద్ధి చెందుతాయి. మచ్చలు ఆకు ఈనెల వరకే పరిమితం చేయబడి ఈనెల మధ్యభాగానికి రెండు వైపులా కనిపిస్తాయి. సాధారణంగా, ఈ మచ్చలు లేత గోధుమరంగు లేదా పసుపు రంగు వలయంతో చుట్టుముట్టబడి ఉంటాయి. వ్యాధి తరువాతి దశల్లో ఈ మచ్చలు ఒకదానితో మరొకటి కలిసిపోయి పెద్ద ముదురు రంగు ప్రాంతాలను ఏర్పరుస్తాయి మరియు ఆకులో ఎక్కువ భాగం నిర్జీవంగా మారవచ్చు. ఆకు తొడుగులు మరియు శూకాల మీద కూడా లక్షణాలు కనిపిస్తాయి. ఆకుల దిగువ భాగంలో శిలీంధ్రాల పెరుగుదల యొక్క తెల్లని గుత్తులను భూతద్దం ఉపయోగించి గమనించవచ్చు. ఆకులు దెబ్బతినడం వల్ల ఆకులు అకాల క్షీణత మరియు దిగుబడి నష్టాలు సంభవించవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, రములారియా కొలో-సిగ్నికి నియంత్రణకై ఎటువంటి ప్రత్యామ్నాయ చికిత్స గురించి మాకు తెలియదు. ఈ వ్యాధితో పోరాడటానికి సహాయపడే ఏదైనా సమాచారం మీకు తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీ మాట కోసం ఎదురుచూస్తూ ఉంటాను

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. ట్రైజోల్‌ ఆధారిత శిలీంద్ర నాశినులతో కూడిన ఆకు పిచికారీలను నివారణ చర్యగా మరియు వ్యాధిని గుర్తించిన తర్వాత నియంత్రణ ఎంపికగా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విత్తన చికిత్సలు ఫంగస్‌పై తక్కువ ప్రభావం చూపుతాయి.

దీనికి కారణమేమిటి?

విత్తనాలు, స్వచ్ఛంద మొక్కలు, ఇతర తృణధాన్యాలు లేదా నేలపై ఉన్న మొక్కల అవశేషాలలో జీవించగలిగే రములారియా కొలో-సిగ్ని అనే ఫంగస్ వల్ల లక్షణాలు సంభవిస్తాయి. బీజాంశం గాలి మరియు వర్షం ద్వారా వ్యాపిస్తుంది. మొక్కల పెరుగుదల యొక్క ఏ దశలోనైనా సంక్రమణ సంభవించే అవకాశం ఉన్నపటికీ సీజన్ చివరిలో పునరుత్పత్తి సమయంలో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. ఆకులపై ఉన్న సహజ రంధ్రాల ద్వారా శిలీంధ్రం మొక్కలోకి ప్రవేశించి అంతర్గత కణజాలాలలో నివాసం ఏర్పరుచుకుంటుంది. ఇది మొక్కకు హానికరమైన విషపూరిత పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తుంది. శిలీంధ్రం అంకురోత్పత్తి మరియు వృద్ధికి ఆకు ఉపరితలంపై తేమ అవసరం (వర్షం లేదా మంచు తర్వాత ఆకు తడి). తేమతో కూడిన వాతావరణం లేదా మంచుతో కూడిన వెచ్చని రోజులు శిలీంధ్రాల పెరుగుదల మరియు సంక్రమణ రేటును పెంచుతాయి.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కల నుండి లేదా ధృవీకరించబడిన మూలాల నుండి సేకరించిన విత్తనాలను ఉపయోగించండి.
  • స్థిరమైన మరియు వ్యాధి నిరోధక రకాలను పెంచండి.
  • తక్కువ పంట సాంద్రత తక్కువగా ఉండేలా చూసుకోండి.
  • వ్యాధి సంకేతాల కోసం పొలాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.
  • ఈ వ్యాధి సోకని మొక్కలతో పంట భ్రమణాన్ని అమలు చేయండి.
  • బార్లీ, వోట్స్ లేదా రై సాగును నివారించండి.
  • పంటకోత తర్వాత పొట్టలను తొలగించి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి