గోధుమ

రాగి రంగు మచ్చలు (టాన్ స్పాట్)

Pyrenophora tritici-repentis

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పసుపు రంగు అంచులతో రాగి-గోధుమ రంగు మచ్చలు ఆకుల పైన మరియు కింద కనపడతాయి.ఆకు అంచు నుండి ఆకు మొత్తం నిర్జీవంగా మారిపోతుంది.
  • గులాబీ లేదా ఎరుపురంగు గింజలు (ఎరుపు మారక) లేదా నల్లటి రంగులోకి మారే అవకాశం ఉంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

గోధుమ

లక్షణాలు

ఆకులపై నెక్రోసిస్ లేదా క్లోరోసిస్ లేదా రెండింటి వ్యాధి లక్షణాలు కనపడతాయి. ఆకుల పైభాగంలో మరియు ప్రక్క భాగంలో రాగి గోధుమ రంగు నిర్జీవమైన మచ్చలు ఏర్పడతాయి. తరువాత ఈ రాగిరంగు మచ్చలు పాలిపోయిన పచ్చ రంగు లేదా పాలిపోయిన పసుపు రంగులోకి మారతాయి. ఈ మచ్చలు ఒకొక్కటి ఒకొక్క పరిమాణంలో ఉంటాయి. ఈ మచ్చల మధ్యభాగం ఎండిపోయి బూడిద రంగులోకి మారుతుంది. అధిక తేమ వున్న వాతావరణంలో ఆకులపై తేమ వున్నప్పుడు ఈ మచ్చలు అన్ని కలసి పెద్ద మచ్చగా ఏర్పడతాయి. దీనివలన ఆకులు చనిపోయి రాలిపోతాయి. ఈ సూక్షక్రిములు గింజలపై గులాబీ రంగు లేదా ఎర్రని చారలను కలగా చేసి(ఎర్రటి ముద్ద లాంటి రంగు) లేదా ఇతర ఫంగస్ తో కలసి నల్లటి రంగు మచ్చలను కలగచేస్తాయి. కానీ పుష్పగుచ్చాలు మాత్రం ఎటువంటి నష్టానికి గురికావు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

మట్టిలో వీటికి విరుద్ధమైన సూక్ష్మజీవుల ఆవాసాన్ని ప్రోత్సహించడానికి సమతుల్య ఎరువులను వాడండి. ఆల్టర్నేరియా ఆల్టర్నేట, ఫ్యూసారియం పల్లిడోరోసియం, అసినేటోబాక్టర్, కల్కొసుటిసస్, సేర్రాషియ లిక్యూఫేసియన్స్, మరియు తెల్లటి ఈస్ట్ అనేవి టాన్ స్పాట్ బూజు తెగులుతో పోటీపడి వాటి ఉనికిని సంతృప్తికర స్థాయిలకు తగ్గిస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పైరాక్లోస్ట్రోబిన్, పికాక్సీస్ట్రోబిన్, ప్రోపికోనజోల్, మరియు ప్రొథియోకొనజోల్, ఆధారిత శిలీంద్ర నాశకాలను ఆకులపై పిచికారీ చేయడం వలన ఇవి టాన్ మచ్చలకు వ్యతిరేకంగా అధిక ప్రభావాన్ని చూపుతాయి.

దీనికి కారణమేమిటి?

చలికాలములో గోధుమ గడ్డి లేక విత్తనములపై బతికే ఫిరినోఫోర ట్రిటిసి-రిపెంటిస్ బూజు తెగులు వలన ఈ లక్షణములు కలుగుతాయి. వసంత ఋతువులో పరిణితి చెందిన తరువాత శిలీంద్ర నాశకాలు ఏర్పడి మరియు విడుదల చేయబడి, వాటి పెద్ద పరిమాణము వలన గాలి మరియు నీటి ద్వారా కొద్ది దూరములకు చెదరగొట్ట బడతాయి. ఇవి ఆకుల క్రింది భాగాలలో వ్యాపిస్తాయి. అక్కడ పైఆకులకు మరియు మిగతా ఇతర మొక్కలకు చీడలను వ్యాప్తి చేసే ఫంగస్ ను వృద్ధి చేస్తాయి. వెలుతురు పైన ఆధారపడిన బూజు తెగులు ఎన్నుకోబడిన విషపదార్థముల వలన మొక్కలలో నేక్రోటిక్ మరియు క్లోరోటిక్ లక్షణములు కనపడతాయి. 95 శాతం కన్నా అధికంగా తేమ ఉండడం వలన వలన శిలీంద్రముల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఆకుపైన తేమ, అధిక ఆర్ద్రత మరియు 10 డిగ్రీ సెంటీ గ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రెండు రోజుల పాటు వున్నప్పుడు రెండవ సంక్రమణము జరుగుతుంది. టాన్ మచ్చ విస్తరించడానికి సరైన ఉష్ణోగ్రత 20 నుండి 25 డిగ్రీలు.


నివారణా చర్యలు

  • ఈ ఫంగస్ తెగులు సోకిన విత్తనాల ద్వారా సోకుతుంది.
  • అందువలన ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే వాడండి.
  • ఫంగస్ పెరుగుదల ఆపడానికి మొక్కలను ఒకదానికి ఇంకొకటి దూరంగా నాటండి.
  • పంట కొత్త అయిన తర్వాత పంట అవశేషాలను పొలంలోపలవరకు దున్ని పూడ్చడం వలన ఈ తెగులు తరువాత పంటలకు సోకకుండా చూడవచ్చు.
  • ఎందుకంటే ఈ శిలీంద్రం మట్టిలో వున్న సూక్ష్మ జీవులను ఎదుర్కోలేనంత సున్నితంగా వుంటుంది.
  • ఆవాలు, అవిసె, క్రంబే లేదా సోయాబీన్ వంటి పంటలతో పంట మార్పిడి చేయడం సిఫార్స్ చేయబడినది.
  • మొగ్గ వేయడం మరియు పుష్ఫీకరణం దశల మధ్య మొక్కలను జాగ్రత్తగా పర్యవేక్షించాలి.
  • పంట కోత తరువాత మొక్కల అవశేషాలను దున్ని నాశనం చేయండి.
  • మొక్కల నిరోధకతను పెంచడానికి ఎరువులను సమతుల్యంగా వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి