చిరుధాన్యాలు

చిరుధాన్యాలలో తుప్పు తెగులు

Puccinia substriata

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పసుపు నుండి తెల్లని రంగు మచ్చలు ఆకులపైన ఏర్పడతాయి.
  • తరువాత పసుపు రంగు అంచుతో కూడిన ఎర్రని నారింజరంగు "తుప్పు" స్ఫోటములు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు


చిరుధాన్యాలు

లక్షణాలు

ఆకుల రెండుప్రక్కలా పసుపు నుండి తెల్లని మచ్చలు కనపడతాయి. ఈ మచ్చలు ఉబ్బెత్తుగా ఉండవచ్చు. ఈ తెగులు విస్తరించే కొలదీ ఈ మచ్చలు ఒకదానితో ఇంకొకటి కలసిపోయి ఎర్రని నారింజ రంగు మరియు తుప్పు రంగు బుడిపెలుగా మారతాయి. ఇవి పసుపు రంగు అంచులతో ఉంటాయి. తరువాత ఇవి ముదురు రంగులోకి మారతాయి. ఈ తెగులు వలన ఆకులు చనిపోవచ్చు మరియు తెగులు తీవ్రత అధికంగా ఉంటే మొక్కలు కుప్పకూలిపోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి. పుక్కినియా సబ్స్త్రీయాట ను నియంత్రించడానికి ఎటువంటి ప్రత్యామ్న్యాయ చికిత్స అందుబాటులో లేదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మమల్ని సంప్రదించండి. మీ నుండి వినడానికి ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

కాపర్ ఉత్పత్తులు, క్లొరాన్తలోనిల్ , సల్ఫర్ లేదా మాంకోజెబ్ చిరు ధాన్యపు పంటలలో ఈ తుప్పు తెగులును నియంత్రిచడానికి వుపయోగించవచ్చు. చిన్న కమతపు రైతులు శీలింద్ర నాశినులను వాడడంవలన ఆర్ధికంగా లాభసాటి కాదు.

దీనికి కారణమేమిటి?

వీటికి వంగ మరియు ఇతర గడ్డి రకాలు వంటి అనేక ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలు వున్నాయి. గాలి ద్వారా ఈ ఫంగస్ సుదూర ప్రాంతాలకు విస్తరించగలదు. అంతేకాకుండా ఇది మట్టిలోను, పంట అవశేషాలలోను మరియు ఇతర ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలపైన జీవిస్తుంది. ఆకులపైన మంచు బిందువులు ఏర్పడే పరిస్థితులైన చల్లని రాత్రులు మరియు వెచ్చని పగలు వీటికి అనుకూలంగా ఉంటాయి. ఈ పరిస్థితులు ఈ తెగులు సంక్రమించే అవకాశాలను పెంచుతాయి. .


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక విత్తన రకాలను వాడండి.
  • పంటకు పైనుండి నీరు పెట్టకండి.
  • చిరుధాన్యాల పంటలను జొన్న మరియు చిక్కుడు జాతి పంటలతో పంట మార్పిడి చేయండి.
  • వీటికి దగ్గరలో వంగ పంటను వేయకండి.
  • గడ్డి వంటి కలుపు మొక్కలను తొలగించండి.
  • పొలంలో మంచి పరిశుభ్రతను పాటించండి.
  • పంట అవశేషాలను తొలగించండి లేదా కాల్చివేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి