వేరుశనగ

ఫిల్లోస్టికా ఆకు మచ్చ

Nothophoma arachidis-hypogaeae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకుల పై ఎరుపు-గోధుమ రంగు అంచులు కలిగిన గుండ్రం మరియు అపసవ్య మచ్చలు ఏర్పడతాయి.
  • తెగులు విస్తరిస్తునప్పుడు ఈ మచ్చలు బూడిద రంగులోకి మారి ఎండిపోతాయి, చివరికి ఆకులన్నీ చిరిగిపోయినట్టు కనిపించేలా ఒక కన్నం చేసి ఆ తర్వాత రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వేరుశనగ

లక్షణాలు

ఆకుల పై ఎరుపు-గోధుమ రంగు అంచులు కలిగిన గుండ్రటి మరియు అపసవ్య మచ్చలు (1.5 - 5 మిల్లీమీటర్లు) ఏర్పడతాయి. తెగులు విస్తరిస్తునప్పుడు ఈ మచ్చలు బూడిద రంగులోకి మారి ఎండిపోతాయి. ఆకులన్నీ చిరిగిపోయినట్టు కనిపించేలా ఒక కన్నం చేసి ఆ తర్వాత రాలిపోతాయి. ఈ మచ్చలు ఒక చోటకు చేరి పెద్ద నిర్జీవమైన పట్టీ లాగా మారే అవకాశం ఉంది. నల్లటి, మిరియాల లాంటి చిన్న చిన్న ఫంగల్ మచ్చలు తెగులు సోకిన కణజాలాల లోపల ఆకుల రెండు వైపులా కనిపిస్తాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి. ఈ ఫిల్లోస్టికాఅరాచిడ్స్- హైపోగే తెగులుకు మా వద్ద ఎటువంటి జీవ నియంత్రణా పద్ధతులు లేవు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలియచేయండి. మీ నుండి వినడానికి మేము ఎదురుచూస్తూ వున్నాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఫిల్లోస్టికా ఆకు మచ్చ వలన చాలా తక్కువగా నష్టం కలుగుతుంది. అందువలన శీలింధ్ర నాశినులను చాలా తక్కువగా సిఫార్సు చేయబడ్డాయి.

దీనికి కారణమేమిటి?

ఫంగస్ ఒక సంవత్సరం పాటు భూమిలో వుండే పంట అవశేషాలలో జీవించే ఉంటుంది. భూమిలో నుండి ఇవి సాధారణంగా మొక్క యొక్క దెబ్బతిన్న మరియు మృతకణజాలం మీద దాడి చేస్తాయి. తరవాత ఇవి ఆరోగ్యకరమైన కణజాలాలకి వ్యాపిస్తాయి మరియు ఈ తెగులుకు సంబంధించిన లక్షణాలను బహిర్గతం చేస్తాయి. 25-30°C ఉష్ణోగ్రత వద్ద మరియు 5.5- 6.5 pH వద్ద ఈ ఫంగస్ బాగా అభివృద్ధి చెందుతుంది. ఫిల్లోస్టికా ఆకు మచ్చ తెగులు వేరుశనగలో ఒక ప్రధాన తెగులుగా పరిగణించబడదు.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు నిరోధక రకాలను వాడండి.
  • పొలంలో పని చేసే సమయంలో మొక్కలకు దెబ్బ తగలకుండా చూడాలి.
  • కోత అనంతరం పంట అవశేషాల్ని కాల్చి వేయాలి.
  • నేల pH ను పెంచడానికి పొలంలో సున్నం వేయొచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి