మొక్కజొన్న

మొక్కజొన్నలో సాధారణ తుప్పు తెగులు

Puccinia sorghi

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులపై చిన్న చుక్కలు, మెల్లగా బుడిపెల వంటి మచ్చలుగా మారుతాయి.
  • ఈ మచ్చలు తరువాత బంగారపు-గోధుమ రంగు బూడిపెలుగా చెదురుమొదురుగా ఆకుల పై మరియు ఆకుల కింది పక్కలో కనిపిస్తాయి.
  • కొమ్మలు బలహీనంగా మారి ఒక ప్రక్కకు పడిపోతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

బాగా చిన్న సైజులో ఆకుల రెండువైపులా ఏర్పడతాయి. ఆ తర్వాత ఇవి మెల్లగా చిన్న రాగి రంగులో ఉంది కొద్దిగా ఉబ్బినట్టు అవుతాయి. ఈ పొడవుగా వున్న బుడిపెలు ఆ తర్వాత పౌడర్ లాంటి బంగారపు-గోధుమ రంగు బుడిపెలుగా రూపాంతరం చెందుతాయి. ఇవి చెదురుమదురుగా ఆకులపై మరియు ఆకు క్రింది పక్కన కనిపిస్తాయి. మొక్కలు ఎదిగే సమయంలో ఇవి నలుపు రంగులోకి మారుతాయి. ఇతర తుప్పు తెగులకు విరుద్దంగా, ఇవి ఇతర మొక్క భాగాలపై కనిపించవు. ఉదాహరణకి కొమ్మలు, తొడుగులు ఆకులు వంటి వాటిపై కనిపించవు. లేత ఆకులకు ఇది సోకే అవకాశాలు ఎక్కువ. వీటి వల్ల దిగుబడిలో అధిక నష్టాలు కలుగుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులుకు జీవ సంబంధిత నియంత్రణ లేదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు తెలపండి.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు సోకే అవకాశం వున్న పంటలో శీలింద్ర నాశినులను వాడడం వలన ప్రయోజనం ఉంటుంది. వాతావరణ పరిస్థితులవలన ఈ తెగులు త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఉంటే సీజన్ మొదట్లోనే దీనిని నియంత్రించడానికి ఈ మందులను ఆకులపైన పిచికారిగా వాడడం మంచింది. ఈ తుప్పు తెగులును నివారించడానికి చాల రకాల మందులు అందుబాటులో వున్నాయి. మాంకోజెబ్, పైరాక్లోస్ట్రోబిన్ , పైరాక్లోస్ట్రోబిన్ + మెట్మెట్కోనజోల్, పైరాక్లోస్ట్రోబిన్ + ఫ్లూక్సా పైరోక్సడ్, అజోక్సిస్ట్రోబిన్ + ప్రొపికోనజోల్, ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ + ప్రోతీయకోనజోల్ మందులను వాడి ఈ తెగులును నివారించవచ్చును. ఉదాహరణకు: ఈ బుడిపెలు వచ్చిన వెంటనే మాంకోజెబ్ @ 2.5 g/l ను పిచికారీ చేసి మరల ప్రతీ 10 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారీ చేయవచ్చును.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు పుక్కినియా సోర్గి అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. ఈ ఫంగస్ ఇంకొక అతిధి మొక్కపై జీవిస్తూ( ఆక్సాలిస్ జాతి) వసంత కాలంలో బీజాంశాలను విడుదల చేస్తాయి. ఈ బీజాంశాలు గాలి మరియు వర్షం వల్ల వ్యాపిస్తాయి. ఇవి ఆకులపై పడడం వలన తెగులు సోకుతుంది మరియు మొక్క నుండి మొక్కకు గాలి మరియు వర్షం వలన సోకుతాయి. అధిక తేమ, వర్షం మరియు చల్లటి ఉష్ణోగ్రతలు 15 నుండి 20°C మధ్యలో ఈ ఫంగస్ బాగా వ్యాప్తి చెందుతుంది. వేడి వాతావరణంలో ఇది వ్యాపించదు. విత్తనాల కోసం వేసే మొక్కజొన్న పంటలో మరియు స్వీట్ కార్న్ లో ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటుంది. పశువుల దానికోసం పండించే పంటలో, ఇండస్ట్రియల్ అవసరాలకోసం వాడే పంటలో మరియు ప్రాసెస్ ఫుడ్స్ తయారి కోసం వాడే పంటలో దీని తీవ్రత పెద్దగా ఉండదు. మొక్కల ఉత్పాదకత తగ్గడం వలన పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక విత్తన రకాలను వాడాలి.
  • త్వరగా నాటడం వల్ల ఈ తెగులు సోకటానికి అనుకూల వాతావరణాన్ని తప్పించవచ్చు.
  • స్వల్పకాలిక రకాలు వాడాలి.
  • ఈ తెగులు సోకని మొక్కలతో పంట మార్పిడి పద్ధతులు వాడాలి.
  • సమతుల్య ఎరువులను ఉపయోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి