అరటి

పనామా కుళ్ళు తెగులు

Fusarium oxysporum

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ముదురు ఆకులు పసుపురంగు లోకి మారి వాడిపోతాయి.
  • ఆకులు గోధుమ రంగులోకి మారి కుప్పకూలిపోతాయి.
  • కాండం విడిపోతుంది.
  • పసుపు నుండి ఎర్రని చారలు కాండంపైనా ఏర్పడతాయి.
  • అంతర్గత కణజాలం రంగు కోల్పోతుంది.
  • చివరికి మొక్కల అన్ని భాగాలు కుళ్లిపోయి చనిపోతాయి.
  • ధుమ రంగులోకి మారి రాలి పోతాయి..

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

ఈ తెగులు, అరటి రకాలు, సూక్ష్మ జీవుల శక్తి మరియు వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇది మొదట ముదురు ఆకులపై దాడి చేసి తరువాత మెల్లగా పైకి పెరుగుతూ లేత ఆకులపై సోకుతుంది. పసుపు రంగు మరియు ఎండిన ఆకులు మరియు కాండాలు చీలిపోవటం వంటివి ఈ తెగులు లక్షణాల్లో కొన్ని ఉంటాయి. పసుపు నుండి ఎరుపు చారలు కాండాలపై కనిపిస్తాయి. ఎరుపు నుండి ముదురు గోధుమ రంగులు కాండాల అంతర్గత కణజాలంపై కనిపిస్తాయి. క్రమంగా భూమి కింద మరియు పైన అన్ని భాగాలు చనిపోయి కుళ్లిపోతాయి .

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ట్రైకోడెర్మా విరిడే వంటి ఫంగస్ లేదా సూడోమోనాస్ ఫ్లోరేసెన్స్ లాంటి బాక్టీరియా జీవనియంత్రణ పదార్థాలు భూమిలో వేయడం వలన ఈ తెగులు రాకుండా నివారించడం లేదా తెగులు తీవ్రతను తగ్గించే అవకాశం వుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఇతర ఫంగల్ వ్యాధుల లాగ దీనిని శీలింద్ర నాశకాల తో నివారించడం కుదరదు. అరటి పిలకలను కార్బెన్డజిమ్ లో ముంచటం ( 10 గ్రాములు/10 లీటర్ల నీరు) మరియు ప్రతి రెండు నెలలకు ఒకసారి భూమిని నీటితో నింపడం మంచిది.

దీనికి కారణమేమిటి?

పనామా తెగులును ఫుస్సరియం విల్ట్ అని కూడా పిలుస్తారు. పనామా కుళ్ళు తెగులు ఫుస్సరియం ఆక్సీపోరుమ్ అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. ఇది మట్టిలో కొన్ని దశాబ్దాల పాటు జీవిస్తుంది. ఇది వేర్ల పిలకలు ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది. ఇది నేల పైన ఉన్న నీటి ద్వారా, వాహనాలు, పరికరాలు మరియు పాదరక్షల వల్ల తక్కువ దూరాలకు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన విత్తనాల పదార్ధాలు సహజంగా ఈ తెగులును ఎక్కువ దూరాలకు వ్యాపింప చేస్తాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు కూడా ఈ తెగులు వ్యాప్తికి ఒక ప్రధాన కారణం. పోషకాలు అందించే కణజాలాలు కుళ్లిపోవటం వలన ఆకులు పసుపు రంగులోకి మారటం మరియు మొక్కల సత్తువ తగ్గిపోవటం జరుగుతుంది. ఒక వేళ దీనికి అన్ని పరిస్థితులు సహకరిస్తే ఇది అరటిలో ఒక తీవ్రమైన నష్టం కలిగించే తెగులు.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మరియు తెగులు నిరోధక మొక్కల రకాలు వాడాలి.
  • మంచి మురుగు నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి.
  • ప్రతి రెండు వారాలకు ఒకసారి మొక్కలను పరీక్షించాలి.
  • హెర్బిసైడ్స్ ని వాడి తెగులు సోకిన మొక్కలను చంపవచ్చు.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించి కాల్చి వేయాలి.
  • పరికరాలను సోడియం హైపోక్లోరైట్ తో శుద్ధి చేయాలి.
  • 3-4 సంవత్సరాల వరకు ఈ తెగులు సోకిన భూమిలో అరటి పంట వేయరాదు.
  • చెరుకు, వరి లేదా పొద్దుతిరుగుడు లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి.
  • చైనీస్ లీక్స్ ను( అల్లీయం ట్యూబెరోజుమ్) అంతర్గత పంటగా వేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి