అరటి

అరటిలో ఆకు మచ్చ తెగులు

Colletotrichum musae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పండ్ల పైన ముదురు-గోధుమ రంగు నుండి నల్లటి మచ్చలు కనిపిస్తాయి.
  • ఇవి పెద్ద ప్యాచీలుగా వృద్ధి చెందుతాయి.
  • వీటి మధ్య భాగంలో నారింజ నుండి సల్మాన్ గులాబీ రంగు ఫంగస్ ఎదుగుదల కనిపిస్తుంది.
  • పండ్లు ముందుగానే పక్వానికి వచ్చి కుళ్లిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

అరటి

లక్షణాలు

తెగులు సోకిన పండ్లపై ముదురు-గోధుమ నుండి నల్లటి మచ్చలు వ్యాధి సోకిన పండ్ల పై కనిపిస్తాయి. ప్రధమ లక్షణాలు ఆకుపచ్చగా ఉన్న పండ్లపై కనిపిస్తాయి మరియు అవి తొక్క పై ముదురు గోధుమ నుండి నలుపు రంగు మచ్చలుగా కనిపిస్తాయి. పసుపు రంగులోకి మారుతున్న పండ్లలో ఈ మచ్చలు కలసిపోయి పెద్ద పరిమాణంలో నల్లటి మచ్చలుగా మారుతాయి. నారింజ నుండి గులాబీ రంగు ఫంగల్ ఎదుగుదల మధ్యలో కనిపిస్తుంది. తెగులు సోకిన పండ్లు తొందరగా పండటం దీని వల్ల గుజ్జు కుళ్లిపోవటం జరుగుతాయి. ఈ తెగులు మొదటి లక్షణాలు కోత తరువాత కూడా రవాణా లేదా నిలువ సమయాలలో కనిపించే అవకాశాలు ఉన్నాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

కోత సమయంలో పండ్ల పై 10% అరబిక్ జిగురుతో కలిపి 1.0% చితోసన్ (చితోసన్ యొక్క ఇంకొక ఉత్పత్తి) వంటి జీవ శీలింద్రాలను చల్లటం ఈ తెగులును నియంత్రించటంలో ఉపయోగపడుతుంది అని నిర్ధారించారు. అనేక రకాల సశ్యాధారిత మిశ్రమాలను కూడా విజయవంతంగా వాడటం జరిగింది. ఉదాహరణకి సిట్రిక్ పదార్థాలు, జింజిబేర్ ఆఫిసినాల్ పదార్థాలు మరియు అకేసియా ఆల్బీడ, పోళ్య్లతియా లొంగిఫ్లోలియా మరియు కెలెరోడ్రెండం యీనెర్మే వంటి ఆకుల పదార్థాలు. పంటపై వీటి ప్రభావం ఇంకా ధృవీకరించ బడలేదు. ఆకుపచ్చ పండ్లను దాదాపుగా 55°C వేడి నీటిలో 2 నిమిషాల పాటు ముంచి ఉంచటం కూడా ఈ తెగులు ప్రభావాన్ని తగ్గిస్తుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సాగు సమయంలో అరటి గెలలపై మాంకోజెబ్ (0.25 %) లేదా బెంజిమిడాజోల్స్ (0.05%) పిచికారీ చేసి పంట కోసిన తర్వాత పైన కవర్లతో కప్పడం వలన ఈ తెగులు పండ్లకు నష్టం కలగచేయకుండా నివారించవచ్చు. పంట కోత తర్వాత పండ్లను బెంజిమిడాజోల్స్ ద్రావణంలో ముంచడం లేదా పిచికారీ చేయవచ్చు. బ్యూటీలేటెడ్ హైడ్రస్యనిసొల్( BHA) వంటి ఫుడ్ గ్రేడ్ రసాయనాన్ని పండ్ల పై పూతగా పూయడం వలన ఈ శీలింద్ర నాశినుల ప్రభావం ఇంకా అధికమవుతుంది.

దీనికి కారణమేమిటి?

అరటి ఆకుమచ్చ తెగులు కొల్లెటోత్రీచుము ముసాయి అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. ఇది ఎండిపోయిన లేదా కుళ్లిపోయిన పండ్లపై జీవిస్తుంది. ఇది గాలి. నీరు, కీటకాలు మరియు అరటిని తినే పక్షులు, ఎలుకల వలన వ్యాపిస్తుంది. ఇవి పండ్ల తొక్కపై చిన్న గాయాల ధ్వారా లోపలికి చేరి తరువాత తెగులు లక్షణాలు కనిపించే లాగా చేస్తాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, అధిక తేమ మరియు తరుచు వర్షం పడడం వంటివి ఈ తెగులు విస్తరించడానికి బాగా సహకరిస్తాయి. ఈ లక్షణాలు పండుతున్న అరటి గెలలపై లేదా పంట కోసిన తర్వాత కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగులు రవాణా సమయంలో ఇంకా నిలువ ఉంచే సమయంలో అరటి పండ్ల నాణ్యతను తగ్గిస్తాయి.


నివారణా చర్యలు

  • కోత సమయంలో, ప్యాకేజింగ్ మరియు నిలువ సమయాల్లో అరటి కణజాలాలకు ఎటువంటి హాని కలగకుండా చూడాలి.
  • గెలలు తయారయ్యాక వాటిని కలుషితం కాకుండా కాపాడటానికి ప్లాస్టిక్ తొడుగులు వాడాలి.
  • కోత తర్వాత పంట కలుషితం కాకుండా చూడడానికి ఈ పండ్లను ప్రాసెస్ చేసే ప్రదేశాలను, నిలువ ఉంచే ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలి.
  • పండ్లపైన ఫంగస్ బీజాలను తొలగించడానికి పండ్లను నీటితో కడగాలి.
  • కుళ్లిపోతున్న ఆకులను, మిగిలిన పువ్వు భాగాలను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి