బొప్పాయి

బొప్పాయి గోధుమ రంగు మచ్చ మచ్చలు

Corynespora cassiicola

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న గోధుమ రంగు మచ్చలు ముదురు ఆకుల పై కనిపిస్తాయి.
  • మచ్చలు పెద్దగా అయ్యి తరువాత లేత బూడిద రంగులోకి మారుతాయి.
  • ఈ మచ్చల మధ్యన కణాలు నిర్జీవమై రాలి పడిపోయి రంద్రాలు ఏర్పడతాయి.
  • తడి వాతావరణంలో అణిగిపోయినట్టు వుండే గోధుమ రంగు మచ్చలు పండ్ల పై కూడా కనిపించవచ్చు .

లో కూడా చూడవచ్చు

1 పంటలు

బొప్పాయి

లక్షణాలు

చిన్న గోధుమ రంగు మచ్చలు ముదురు ఆకుల పై కనిపిస్తాయి. మచ్చలు పెద్దగా అయ్యి తరువాత లేత బూడిద రంగులోకి మారుతాయి. ఈ మచ్చల మధ్యన కణాలు నిర్జీవమై రాలి పడిపోయి రంద్రాలు ఏర్పడతాయి. అందువలన ఆకు అంతా చిరిగినట్టు కనిపిస్తుంది. అప్పుడప్పుడూ ఈ దీర్ఘ వృత్తాకార ముదురు గోధుమ రంగు మచ్చలు ఉబ్బెత్తుగా కాడలపైన కూడా ఏర్పడవచ్చు. ఈ మచ్చలు పెదవి అయ్యి చుట్టూ ముదురు రంగు వలయంతో లేత బూడిద రంగులోకి మారతాయి. ఎక్కువ కాలం తడి వాతావరణం వున్నప్పుడు ఈ అణిగిపోయినట్టు వుండే గోధుమ రంగు మచ్చలు కనపడతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

సిలోన్ సిన్నమన్ నూనె ను (0.52 μL/mL) వాడి మచ్చల పరిమాణాన్ని తగ్గించవచ్చు. పండ్లు తయారవ్వకముందే మొక్కలకు చికిత్స చేయడం చాలా ముఖ్యం, లేకపోతే దీని ప్రభావం ఉండదు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు మాంకోజెబ్, కాపర్ లేదా క్లోరోతలోనిల్ వంటి క్రిమినాశినిలు వాడి నియంత్రించవచ్చు. ఉదాహరణకు ఆకులు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు వీటిని వాడవచ్చు. ఈ తెగుళ్లు బెంజిడాజోలె సీలింద్ర నాశినిని తట్టుకునే సామర్ధ్యం పెంచుకున్నాయి.

దీనికి కారణమేమిటి?

ఈ వ్యాధి కోరినేస్పోర కస్సికోలా అనే ఫంగస్ వలన వస్తుంది..ఇది ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో సహజంగా కనిపిస్తుంది. ఇది ఎక్కువగా టమోటాలో కన్పిస్తుంది కానీ అపుడపుడు బొప్పాయిమొక్కలను కూడా ఆశిస్తుంది. ఇది ఆకుల కింది భాగాలలో తయారు అయ్యే స్పోర్స్ వలన వ్యాపిస్తుంది. ఇది వర్షం మరియు గాలి వలన వ్యాపిస్తుంది. అధికంగా తడి మరియు తేమ వున్నవాతావరణంలో ఈ తెగులు మరింతగా వ్యాపిస్తుంది. ఆకులు ఎండిపోవడం వల్ల దిగుబడి లో నష్టాలు కలుగుతాయి. ఆవొకాడో, బ్రెడ్ ఫ్రూట్ పెండలం, సోయాబీన్ మరియు వంగమొక్కలు ఈ తెగులుకు అతిధి మొక్కలుగా ఉంటాయి.


నివారణా చర్యలు

  • ముందుగానే నివారణ చర్యలు తీసుకొనేంత ప్రభావం ఈ తెగులు బోపాయిపైన చూపించదు.
  • బొప్పాయిను టమోటా మరియు కీరదోస పంటల దగ్గరగా వేయవద్దు.
  • ఒ పొలంనుండి ఇంకొక పొలానికి ఈ తెగులు సోకకుండా ఉండడానికి పొలంలో కలుపు లేకుండా చూడాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి