మామిడి

ఫోమా ఎండు తెగులు

Peyronellaea glomerata

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ముదురు ఆకులపై ఒక సక్రమ పద్దతిలో లేని పసుపు నుండి గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి.
  • తరువాత ఈ మచ్చలు పెద్ద అతుకులుగా మారి మధ్యలో బూడిద రంగు నిర్జీవ భాగంగా మారిపోతాయి.
  • ఆకులు వాడిపోయి రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు


మామిడి

లక్షణాలు

వీటి లక్షణాలు కేవలం పాత ఆకుల పైనే కనిపిస్తాయి. ప్రభావానికి గురైన ఆకులు పసుపు నుండి గోధుమరంగులో సక్రమమంగా లేని మచ్చలు ఆకు మొత్తం వ్యాపిస్తాయి. తరువాత ఈ మచ్చలు పెద్ద అతుకులుగా మారి మధ్యలో బూడిదరంగు నిర్జీవ ప్రాంతం కలిగి ఉంటాయి. ఆకులు ఎండిపోతాయి. ఆఖరి దశలో ఆకులు వాలిపోయి రాలిపోతాయి. ఈ తేజిలుకు ప్రత్యామ్న్యాయ తితిదే మొక్కలుగా కామన్ వైన్ ( విటిస్ వినిఫెర) మరియు కెంటకీ గడ్డి( పోవ ప్రటెన్సిస్) వంటివి ఉంటాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులు మొదటి సారి కనిపించినప్పుడు కాపర్ ఆక్సీక్లోరైడ్ (0.3%) పిచికారీ చేయడం వలన మరియు 20 రోజులకు ఒకసారి చొప్పున వాడడం వలన దీనిని నియంత్రించవచ్చు. పండ్లపై వేప ఆకు సారాలు వాడడం వలన మరియు చల్లటి ప్రదేశాల్లో నిలువ ఉంచటం వలన కూడా ఈ తెగులు సోకకుండా చూడవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే బెనోమిల్ (0.2%) ను తరువాత 0.3% మిల్టాక్స్ 20 రోజుల విరామంతో పిచికారీ చేయడం వలన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

దీనికి కారణమేమిటి?

ఫోమా ఎండు తెగులు ఒక కొత్త వ్యాధి, కానీ ఇప్పుడు ఇది మామిడి పెంచే ప్రాంతాల్లో ఆర్ధిక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది పెయ్రోనెల్లా గ్లోమెరట అనే ఫంగస్ వలన కలుగుతుంది. ఈ ఫంగస్ భూమి లో మరియు అనేక చనిపోయిన లేదా జీవించి ఉన్న మొక్కల భాగాలపై ( విత్తనాలు, పండ్లు మరియు కూరగాయలు) జీవిస్తుంది. ఇది చెక్క, సిమెంట్, ఆయిల్ పెయింట్ వేసిన స్థలాలు మరియు పేపర్ పై కూడా కనిపిస్తుంది. ఇతర తెగులు సోకిన తర్వాత సోకే తెగులుగా దీనిని చెప్తారు. కానీ కొన్ని మొక్కలలో మరియు వాతావరణ పరిస్థితులలో ( తేమ వాతావరణం మరియు అధిక ఉష్ణోగ్రతలు) ఈ తెగులు సోకడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఉష్ణోగ్రతలు 26°C నుండి 37°C మధ్యన ఇది బాగా ఎదుగుతుంది.


నివారణా చర్యలు

  • నిల్వ సమయంలో ఫంగస్ పెరగకుండా ఉండడానికి పంటలు నిల్వ ఉంచే స్థలాలను శుద్ధి చేయాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి