మామిడి

మామిడి డైబ్యాక్ తెగులు

Botryosphaeria rhodina

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • చెట్టు బెరడు కొమ్మలు మరియు ఆకులు నల్లగా మారి వాడిపోతాయి.
  • ఆకులు పైకి ముడుచుకుపోయి రాలిపోతాయి.
  • ఆకులు రాలిపోతాయి.
  • కొమ్మలు మరియు రెమ్మల నుండి జిగురు పదార్థం కారుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

మామిడి

లక్షణాలు

ఈ తెగులు మామిడి చెట్లలో బోతియోస్ఫరియా రోడిన అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. ఇది ఎండిన కొమ్మలలో జీవిస్తుంది. మొదటిదశ లో బెరడు రంగు కోల్పోయి ముదురుగా మారుతుంది. తరవాతి దశల్లో లేత కొమ్మలు ఎండిపోవడం మొదలవుతుంది మరియు ఇది ఆకులకు కూడా సోకే అవకాశం ఉంటుంది. ఈనెలు గోధుమరంగు లోకి మారి ఆకులు పైకి ముడుచుకు పోతాయి మరియు చివరికి రాలి పోతాయి. చివరి దశల్లో కొమ్మలు మరియు కాండాల పైన జిగురు వంటి పదార్ధం కనిపిస్తుంది. ఈ తెగులు ముదిరే కొద్దీ మొత్తం కాండం అంత ఈ జిగురు పదార్ధం వ్యాపిస్తుంది. తెగులు బాగా తీవ్రంగా వున్నప్పుడు చెట్టి బెరడు కానీ మొత్తం కొమ్మలు అన్ని కానీ చనిపోయి పగుళ్లు ఏర్పడతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

తెగులు సోకిన చెట్ల భాగాలను వెంటనే తొలగించి నాశనం చేయాలి. తెగులు సోకిన భాగాలనే కాకుండా, కొంత వరకు, ఆరోగ్యంగా వున్న భాగాన్ని కూడా నరికి ఈ తెగులు చెట్టు ఇతర భాగాలకు విస్తరించకుండా నాశనం చేయాలి.

రసాయన నియంత్రణ

కత్తిరించిన తరువాత కాపర్ ఆక్సీక్లోరైడ్ 0.3% గాయాల పైన చల్లాలి. బోర్డియక్స్ మిశ్రమాన్ని సంవత్సరానికి రెండు సార్లు వాడటం కూడా ఈ తెగులును తగ్గించడంలో సహాయపడుతుంది. థియోఫానేట్-మిథైల్ కలిగిన ఫంగస్ ను పిచికారీ చేయడం ద్వారా కూడా దీనిని నియంత్రించవచ్చు. బెరడు పెంకు పురుగులను లేదా గొంగళిపురుగులను బిఫెన్త్రిన్ ను చెట్లపై చల్లడం ద్వారా ఈ తెగులు నియంత్రించవచ్చు.

దీనికి కారణమేమిటి?

బోతియోస్ఫరియా రోడిన మొక్కల చనిపోయిన కణజాలంలో చాలా కాలం పాటు జీవించి ఉంటాయి. ఇవి మామిడి చెట్లకు వున్న గాయాల ద్వారా కణజాలంలోకి చొచ్చుకుపోతుంది. ఈ తెగులు యొక్క మెకానిజం ఏమిటో ఇప్పటికీ తెలియదు. పెంకు పురుగులు చేసే రంద్రాలనుండి పొలంలో పనిచేసేటప్పుడు కలిగిన గాయాల ద్వారా ఇవి చెట్లలోకి ప్రవేశిస్తాయి. ఇవి మొక్క ఎదిగే సమయంలో చెట్లపైనే ఉండి పంట చేతికి వచ్చే సమయంలో చెట్టు మొత్తం వ్యాపిస్తాయి. ఐరన్, జింక్ మరియు మాంగనీస్ లోపం కూడా ఈ తెగులు వ్యాపించటానికి సహకరిస్తాయి. ఈ తెగులు సంవత్సరం మొత్తం కనిపిస్తుంది కానీ ఎదుగుదల లోని చివరి దశల్లో అధికంగా ప్రభావం చూపుతుంది.


నివారణా చర్యలు

  • చెట్టు ఆరోగ్యంగా ఉండేలా చూడాలి మరియు క్రమం తప్పకుండ నీరు పెట్టాలి.
  • చెట్లని ఘనీభవన ఒత్తిడి లేదా పోషకాల లోపం ఉన్న చోట వేయకూడదు.
  • తోటను ఏమైనా తెగుళ్లు ఆశిస్తున్నాయేమో తరచూ గమనిస్తూ మొదటి దశలోనే వీటిని పసిగట్టాలి.
  • చెట్లకు ఎటువంటి దెబ్బలు లేదా గాయాలు కలగకుండా చూడండి.
  • ఇవి ఈ ఫంగస్ ఆశించడానికి ప్రధాన మార్గాలు.
  • చనిపోయిన చెట్లను వెంటనే తొలగించండి.
  • సమీకృత ఎరువుల విధానాన్ని పాటించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి