చిరుధాన్యాలు

సజ్జ పంటలో ఎర్గోట్ తెగులు

Claviceps fusiformis

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • క్రీమీ గులాబీ రంగు నుండి ఎర్రని రంగు ద్రవం( హనీ డ్యూ) కంకులపైన కనపడుతుంది.
  • కంకులలోని గింజలను నల్లని స్కెలెరోటియా లేదా ఎర్గోట్లు భర్తీ చేస్తాయి.

లో కూడా చూడవచ్చు


చిరుధాన్యాలు

లక్షణాలు

కంకులలో తెగులు సోకిన ఫ్లోరెట్స్ నుండి గులాబీ నుండి ఎర్రని రంగు ద్రవం స్రవిస్తుంది. ఈ ద్రవం ఆకులపైనుండి నేలపైన పడవచ్చు. ఈ ద్రవంలో చాలా అధిక మొత్తంలో కొనిడియా ఉంటుంది. తెగులు సోకిన ఫ్లోరెట్స్ గింజలను తయారుచేయవు. విత్తనాలు వున్న కంకి ప్రాంతాన్ని నల్లని బూజు భర్తీ చేస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ముడి వేపనూనె ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.

రసాయన నియంత్రణ

జిరమ్ కలిగిన శీలింద్ర నాశినులను ఏర్గోట్ ను నియంత్రించడానికి మరియు నివారించడానికి ఉపయోగించవచ్చును.

దీనికి కారణమేమిటి?

తేమ అధికంగా మరియు 20 నుండి 39°C ఉష్ణోగ్రతలు ఈ తెగులుకు అనుకూలంగా ఉంటుంది. తెగులు సోకిన 5 నుండి 7 రోజులలో ఈ తేనె బంక ( హనీ డ్యూ) స్రవించడం మొదలవుతుంది. ఇది కంకులపైన ఇతరమైన తెగుళ్లు విస్తరించడానికి అవకాశం కలిగిస్తుంది. ఈ తెగులు సోకిన సజ్జలను తిన్నట్లైతే ఎర్గోట్ వలన మనుషులకు మరియు పశువులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. సంవత్సరం పొడవునా ఈ ఫంగస్ పంట అవశేషాలలో జీవించి ఉంటుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధకత కలిగిన రకాలను ఉపయోగించండి.
  • కలుషితంకాని విత్తనాలను ఉపయోగించండి.
  • సంతులిత పోషకాలను( తక్కువ మోతాదులో నత్రజని మరియు అధిక భాస్వరం) మొక్కలకు అందించండి.
  • వర్షాధార పరిస్థితులలో ముందుగానే పంటను వేయండి.
  • పొలాన్ని బాగా దున్ని పంట అవశేషాలను నేల లోపలివరకు పూడ్చిపెట్టండి.
  • జొన్న పంట మధ్యలో పెసలు వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి