ఇతరములు

పెనిసిల్లీయం కంకి కుళ్ళు తెగులు

Penicillium spp.

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఈ ఫంగస్ మొక్కజొన్న పొత్తులపై దాడి చేస్తుంది.ఇతర కీటకాలు లేదా పొలంలో పనిచేస్తున్నప్పుడు తగిలే గాయాల ద్వారా ఇవి మొక్కలోపలకు ప్రవేశిస్తాయి.
  • నీలి ఆకుపచ్చ బూజు పొత్తులపైన మరియు గింజలపై కనిపిస్తాయి.
  • గింజలు లోపలి నుండి కుళ్లిపోతాయి.
  • కొన్నిసార్లు ఈ బూజు, కోత తరువాత లేదా నిల్వ సమయంలో కనిపిస్తుంది.

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

పెనిసిల్లీయం పొత్తు లేదా కంకి కుళ్ళు మొదటి సారిగా కోత అనంతరం మొక్కజొన్న గింజలపై కనిపిస్తుంది. దీని వల్ల మొక్కల ఎదుగుదల తగ్గిపోయి, ఎండిపోతాయి. ఈ ఫంగస్ మొక్కజొన్న పొత్తులపై దాడి చేస్తుంది. ఇతర కీటకాలు లేదా పొలంలో పనిచేస్తున్నప్పుడు తగిలే గాయాల ద్వారా ఇవి మొక్కలోపలకు ప్రవేశిస్తాయి. నీలి ఆకుపచ్చ బూజు పొత్తులపైన మరియు గింజలపై కనిపిస్తాయి. గింజలు లోపలి నుండి కుళ్లిపోతాయి. కొన్నిసార్లు ఈ బూజు, కోత తరువాత లేదా నిల్వ సమయంలో కనిపిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

పెనిసిల్లీయం కంకి లేదా పొత్తుల కుళ్ళు తెగులుకు జీవ సంబంధిత నియంత్రణ లేదు. మీకు ఏమైనా నివారణ మార్గం తెలిసినట్లైతే దయచేసి మాకు తెలపండి. మీనుండి వినడానికి మేము ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

రసాయానిక మందులు వాడే ముందు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే జీవ చికిత్సలు కలసిన నివారణ చర్యలు సమన్వయ పద్దతులు ఉపయోగించడం మంచిది. అవసరమైతే మాంకోజెబ్ లేదా కెప్టెన్ కలిగిన శీలింద్ర నాశినులను ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఇవి నీరు తక్కువగా అందుబాటులో వున్నప్పుడు కూడా పెరుగుతాయి మరియు ఈ తెగులు సోకిన పంట అవశేషాల్లో ఇవి జీవిస్తాయి. ఇవి సహజంగా గాలి మరియు వర్షం వలన వ్యాపిస్తాయి మరియు పొత్తులపై గాయాల ద్వారా సోకుతాయి. ఇవి అధిక తేమ మరియు పెరిగిన ఉష్ణోగ్రతల్లో చురుగ్గా ఉంటాయి. ఈ తెగులు పూత మరియు పండ్లు వృద్ధి చెందే సమయంలో ఎక్కువగా ఉంటుంది. మొదటి లక్షణాలు నిల్వ సమయంలో మాత్రమే కనిపించే అవకాశం ఉంటుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కల విత్తనాలను వాడాలి.
  • తెగులు నిరోధక లేదా సహనాత్మక రకాలు వాడాలి.
  • వర్షపాతం తక్కువ వుండే సమయాలలో మరియు తేమ తక్కువగా వుండే సమయాలలో గింజ పాలుపోసుకునేటట్టు మొక్కలను తగిన సమయం చూసి నాటుకోవాలి.
  • మొక్కల మధ్య తగినంత అంతరం పాటించాలి.
  • పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
  • నష్టాన్ని తగ్గించటానికి పంటను త్వరగా కోయాలి.
  • నిలువ ఉంచే సమయంలో విత్తనాలలో తేమను 14% కన్నా తక్కువ ఉంచాలి.
  • ఇలా చేయడం వలన ఫంగస్ పెరుగుదల ఉండదు.
  • తెగులు సోకిన గింజలను విత్తనాలుగా వాడరాదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి