మొక్కజొన్న

ఎర్ర కుళ్ళు తెగులు

Glomerella tucumanensis

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఎర్రని గోధుమ రంగు మచ్చలు ఆకు కాడలపై ఆకులపై కనిపిస్తాయి.
  • తెల్లని మచ్చల ప్రాంతంలో ఎరుపు రంగు కుళ్లిపోయిన ప్రాంతాలు కనిపిస్తాయి.
  • ప్రధాన ఈనే ప్రాంతంలో ఆకులపై ఎర్రని కోలాకారపు మచ్చలు ఏర్పడతాయి.
  • ఎరుపు, గోధుమ లేదా బూడిద రంగు రూపంలో గింజ ధాన్యం పోతుంది మరియు పుల్లని వాసన వస్తుంది.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

తెగులు సోకిన కొమ్మలు పాలిపోయిన రంగులో ఉంటాయి మరియు రకాన్ని బట్టి వీటిపై ఎక్కువ లేదా తక్కువ పెద్ద ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. కాడను నిట్టనిలువుగా కోసినట్లయితే, తెల్లగా వుండే కాడ లోపలిభాగంలో పొడవుగా వున్న ఎర్రని కుళ్లిపోయిన కణజాలం కనిపిస్తుంది. ఈ తెగులుకు నిరోధకత కలిగిన మొక్కలలో సహజంగా ఇవి కణుపుల మధ్య భాగానికే పరిమితమై ఉంటాయి. లోపలి మెత్తని భాగంలో పగుళ్లు ఏర్పడవచ్చు మరియు అక్కడ గట్టిపడిన ఫైబర్స్ యొక్క కట్టలు కనపడతాయి. ఆకులు వాలిపోయి ముడుచుకుపోతాయి. మొక్కల నుండి ఒకవిధమైన దుర్వాసన రావడం మరియు ప్రతికూల వాతావరణంలో మొక్కలు చాలా సులభంగా విరిగి పోవడం జరుగుతుంది. ఆకుల ప్రధాన ఈనే పై చిన్న ఎర్రని కోలాకారపు లేదా పొడవాటి గాయాలు వృద్ధి చెందుతాయి. కొని సార్లు ఈనే మొత్తం పొడవంతా ఇవి వ్యాపిస్తాయి. కాడల పైతొడుగు మీద ఎర్రటి ప్యాచీలు మరియు అప్పుడప్పుడు మాత్రమే ఈనెల మధ్యన చిన్న పరిమాణంలో ముదురు మచ్చలు ఏర్పడవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

50°C ఉష్ణోగ్రతల వద్ద నీటిలో విత్తనాలను 2 గంటలు నానబెట్టినట్లైతే ఈ ఫంగస్ చనిపోతుంది. చావోటోమియం, స్యుడోమోనాస్ బ్యాక్తీరియా మరియు ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రణ ఏజంట్లను కూడా ఉపయోగించవచ్చు. ఈ పదార్ధాలు కలిగిన ఉత్పత్తులను ఆకులపై పిచికారీ చేయడం వలన ఈ తెగులు విస్తరించకుండా నివారించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. 50-54°C ఉష్ణోగ్రతల వద్ద శీలింద్ర నాశినులు( ఉదాహరణకు తీరం) కలిపిన నీటిలో విత్తనాలను 2 గంటలు నానబెట్టినట్లైతే ఈ ఫంగస్ చనిపోతుంది. పొలంలో నేరుగా ఉపయోగించే రసాయన చికిత్స వల్ల ఫలితం ఉండదు.

దీనికి కారణమేమిటి?

గ్లోమెరేళ్ళ టుకుమనేన్సిస్ అనే ఫంగస్ వలన ఈ తెగులు సోకుతుంది. ఇది కొన్ని నెలల వరకు మాత్రమే మట్టిలో జీవించి ఉంటుంది. ఇది మట్టి ద్వారా వ్యాపించే తెగులు కాకపోయినా వీటి బీజాలు పంట అవశేషాల నుండి మట్టిపైకి చేరి అప్పుడే నాటిన విత్తనాలకు మరియు మొలకలకు సంక్రమిస్తాయి. తరువాత ఈ తెగులు భీజాలు( స్పోర్స్)గాలి, వాన, అధిక మొత్తంలో పొగమంచు మరియు నీటి ద్వారా మొక్కలో ఆకు ఈనెల వద్దకు లేదా కాడలపైకి చేరుతుంది. చల్లని వాతావరణం, నేలలో అధిక తేమ మరియు ఒకే రకమైన పంటలను పొలంలో పదే పదే వేయడం వలన ఈ తెగులు అధికంగా సంక్రమిస్తుంది. కరువు పరిస్థితులు ఈ తెగులు తీవ్రతరమయ్యేటట్టు చేస్తాయి. తెగులు సోకిన మొక్కల వల్ల మరియు కోత అవశేషాల వల్ల కూడా మొక్క నుండి మొక్కకు వ్యాపిస్తాయి. ఒక వేళ ఈ ఫంగస్ మట్టిలో కలిస్తే నాటిన విత్తనాలకు కూడా వ్యాపిస్తుంది. చెరుకు పంటతో పాటు ఈ తెగులు మొక్క జొన్న మరియు జొన్న పంటలను కూడా ఆశిస్తుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక రకాలు నాటండి.
  • పంట మార్పిడి పద్ధతులు పాటించండి.
  • మొక్కలకు అధిక మొత్తంలో నీరు పెట్టకూడదు.
  • తెగులు సోకని పొలాల నుండి సేకరించిన విత్తనాలు మరియు మొలకలు వాడండి.
  • బాగా వేడిగా లేదా బాగా చల్లని ఉష్ణోగ్రతలు వుండే సమయంలో కాకుండా విత్తనాలు వేసే సమయాన్ని మార్చి వేయండి.
  • పొలాన్ని తరుచు గమనిస్తూ ఈ తెగులు సోకిన మొక్కలను తొలగించండి.
  • తెగులు సోకిన మొక్కల పైభాగం కత్తిరించి( రటూనింగ్) మరలా ఈ మొక్కల ద్వారా పంటను పొందడానికి ప్రయత్నించవద్దు.
  • పంట కోతలు పూర్తయిన తర్వాత పంట అవశేషాలను తొలగించి కాల్చి వేయండి లేదా పొలాన్ని బాగా లోతుగా దున్ని మట్టిలో వుండే ఈ ఫంగస్ ను సూర్యరశ్మికి బహిర్గతం చేయండి.
  • ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి