మొక్కజొన్న

మట్టి కంకి పురుగు ( హెడ్ స్మట్)

Sphacelotheca reiliana

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • పుష్ప గుచ్చాలు కొంతవరకు లేదా మొత్తం నల్లని పొడి లాంటి పదార్థంతో కప్పబడివుంటాయి.
  • పొత్తులపైనా మరియు స్పైక్లెట్స్ పైనా అసాధారణ ఆకులవంటి నిర్మాణాలు కనిపిస్తాయి.
  • ఈ తెగులు సోకిన పొత్తులు గుండ్రంగా లేదా నీటి బొట్టు ఆకారంలో వుండి, పూర్తిగా నల్లని పొడి వంటి పదార్ధంతో కప్పబడివుంటాయి.
  • అల్లుకున్నట్టు వున్న నాళము యొక్క పోగులు వీటి బీజాంశాలతో కలిసిపోయి ఉంటాయి.
  • పొత్తులలో గింజలు కానీ పట్టు కుచ్చెలు కానీ వుండవు.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

తెగులు యొక్క మొదటి లక్షణాలు మొక్క పెరుగుదల తరువాతి దశలైన పుష్ప గుచ్చాలు మరియు పొత్తులు కనబడే దశలో కనబడతాయి. పుష్ప గుచ్చాలు కొంతవరకు లేదా మొత్తం నల్లని పొడి లాంటి పదార్ధాలతో కప్పబడివుంటాయి. ఈ తెగులు సోకిన పొత్తులు పూర్తిగా ఈ నల్లని పొడి వంటి పదార్ధంతో కప్పబడివుంటాయి. పుష్ప గుచ్చాల పైన లేదా పొత్తులపైన అసాధారణ ఆకులవంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ప్రభావితమైన పొత్తులు ఆరోగ్యకరమైన కంకుల కంటే గుండ్రంగా వుండి పోర్తిఆ నల్లటి పొడి లాంటి పదార్థంతో నింపబడి వుంటాయి. అల్లుకున్నట్టు వున్న నాళము యొక్క పోగులు వీటి స్పోర్స్ తో కలిసిపోయి ఉంటాయి. పొత్తులలో గింజలు కానీ పట్టు కుచ్చెలు కానీ వుండవు. ఎక్కువగా కొమ్మలు రావడం ఈ తెగులు తరువాత దశలో కనిపిస్తుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

తక్కువ కార్బన్ మరియు నత్రజని నిష్పత్తి కలిగిన ఎరువులు వాడి ఈ తెగులు మొక్కలకు సోకడాన్ని తగ్గించవచ్చు. ఫంగస్ ను తినే పెంకు పురుగులు( ఫలక్రస్ ఒబ్స్కురుస్ మరియు లిస్టోనేచస్ కోయిరులియాస్) జీవ నియంత్రణ ఏజెంట్లుగా పని చేస్తాయి. విత్తనాలను బాసిల్లస్ మెగాటేరియం వంటి బాక్టీరియాతో శుద్ధి చేసి ఈ తెగులు రాకుండా నివారించవచ్చు.

రసాయన నియంత్రణ

విత్తనాలను సిస్టమిక్ శీలింధ్రం అయిన (కార్బోక్సిన్) తో విత్తన శుద్ధి చేయడం వలన ఈ ఫంగస్ మొక్కలకు సంక్రమించకుండా తోడ్పడుతుంది, కానీ ఇది కేవలం కొంతవరకే నియంత్రించడానికి పనిచేస్తుంది. గాళ్ళపైన శీలింద్ర నాశినులను మొలకలు వస్తున్నప్పుడు వాడడం వలన కొంత వరకు ప్రయోజనం ఉంటుంది. కానీ ఆర్ధికంగా ఇది లాభసాటి కాదు.

దీనికి కారణమేమిటి?

స్పసెలోతేకా రెలియానా అనే ఫంగస్ స్పోర్స్ రూపంలో మట్టిలో అనేక సంవత్సరాలు జీవిస్తాయి మరియు ఇవి ప్రత్యేకంగా వేర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇది మొలకల దశలో పంటలో అక్కడక్కడా మొలకలపై వ్యాపిస్తుంది. ఆ తరువాత ఈ ఫంగస్ అన్ని మొక్క భాగాలకు వ్యాపిస్తుంది. ఇది నల్లటి బూజు రూపంలో కనిపిస్తుంది, ఒక్కొకసారి మొత్తం గింజలపై ఇది కనిపిస్తుంది. శుద్ధి చేయని పరికరాల వలన ఒక పొలం నుండి ఇంకొక పొలానికి ఈ తెగులు సోకే అవకాశాలు ఉంటాయి. భూమి లో తక్కువ తేమ, వేడి ఉష్ణోగ్రతలు (21 నుండి 27°C) మరియు పోషకాల లోపం ఈ తెగులు వ్యాప్తికి సహకరిస్తాయి. ఒక సారి ఇది పంటకు సంక్రమిస్తే దీన్ని నివారించడానికి ఎటువంటి ప్రభావవంతమైన చికిత్స లేదు.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక లేదా తెగులును తట్టుకునే రకాలను వాడండి.
  • త్వరగా నాటండి.
  • త్వరగా మొలకలు వచ్చే రకాలను నాటండి.
  • విత్తనాలను బాగా లోతులో వేయవద్దు.
  • మొక్కలకు సమయానుసారం నీరు పెట్టాలి.
  • మరింత వ్యాధి వ్యాప్తిని నివారించడానికి తెగులు సోకిన మొక్కలను తొలగించి కాల్చి వేయాలి.
  • తగినంత నత్రజని మరియు పొటాషియం వాడి భూమి సారం పెంచండి.
  • పంట కోతల తర్వాత పొలాన్ని దున్ని పంట అవశేషాలను నాశనం చేయాలి.
  • 4 లేదా అంత కంటే ఎక్కువ సంత్సరాల అంతరంతో అతిథేయి కాని పంటలతో పంట మార్పిడి పద్ధతులు పాటించండి, ప్రత్యామ్నాయ అతిథేయి అయిన జొన్నతో పంట మార్పిడి చేయొద్దు .

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి