ఉల్లిపాయ

లీక్ రస్ట్

Puccinia porri

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • చిన్న, తెల్లట్టి మచ్చలు ఆకులకు రెండు వైపులా కనిపిస్తాయి.
  • ఈ మచ్చలు తర్వాత నారింజ రంగు త్రుప్పు బుడిపెలుగా వృద్ధి చెందుతాయి.
  • ఆకు ఉపరితలంపై చీలిక ఏర్పడుతుంది.
  • తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు పసుపుబారడం, వడలిపోయి ఎండిపోవడం జరుగుతుంది.
  • వెల్లుల్లి గడ్డలు ముడుచుకుపోయి తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
వెల్లుల్లి
ఉల్లిపాయ

ఉల్లిపాయ

లక్షణాలు

పంట యొక్క ఏ దశలోనైనాఈ తెగులు సంక్రమించవచ్చు అయితే లక్షణాలు మొదట ఆకులపై కనిపిస్తాయి. చిన్న, తెల్లట్టి మచ్చలు ఆకుల ఈనె రెండు వైపులా మొదలవుతాయి. క్రమేణా ఇవి నారింజ రంగు త్రుప్పు బుడిపెలుగా వృద్ధి చెందుతాయి. ఈ బుడిపెలు పెరిగే కొద్దీ, పగిలి, బీజాలను విడుదల చేస్తాయి. ఆకులు క్రమేణా పసుపు బారి ఆకు మొత్తం గాయాలేర్పడి, చీలిక ఏర్పడుతుంది. తీవ్ర పరిస్ధితులలో మొక్క మొత్తం పసుపుబారి, వడలిపోయి అకాలంగా చనిపోతుంది. మొక్క తొలిదశలో కనుక తెగులు ఆశిస్తే చిన్న, ముడుచుకుపోయిన తక్కువ నాణ్యత గల గడ్డలు ఏర్పడతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఒకసారి ఈ తెగులు మొక్కలకు సోకితే దానిని నివారించడం చాలా కష్టం. ఈ తెగులును రాకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. దీనికి అనేక రకాల నివారణ పద్దతులు వున్నాయి ఉదాహరణకు సల్ఫర్ పౌడరును నేతిలో కలిపి మొక్కలపై చల్లవచ్చు లేదా ఆకులపై పిచికారి చేయవచ్చు. లేదా మొక్క మొదళ్ళ వద్ద వేయవచ్చు. ఏ విధానం మీకు సరిపోతుందో మీకు తెలుసుకోవడానికి స్థానికంగా దుకాణుదారుడిని లేదా ప్రోడక్ట్ మాన్యుయల్ ను చదవండి.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అజాక్సిస్ట్రోబిన్ లేదా మాంకోజేబ్ ఉన్న ఉత్పత్తులను నిరోధకాలుగా పిచికారిగాని లేదా మట్టిలోకానాయి వేసి ఆకులు త్వరగా రాలిపోకుండా నివారించవచ్చు. ఈ తెగులును తగ్గించడం సాధ్యంకాని పని అని తెలుసుకోండి.

దీనికి కారణమేమిటి?

పుక్సినియా పోర్రి అనే శిలీంద్రం ద్వారా ఈ తెగులు ఆశిస్తుంది. ఈ శిలీంద్రం జీవించి ఉన్న మొక్కపైనే బతుకుతుంది. ఉల్లిలేని పక్షంలో కలుపు మొక్కలు లేదా స్వచ్చంద మొక్కలపైగాని లేదా నిద్రావస్థ బూజులలోగాని ఉంటుంది. ఈ శిలీంద్రపు బీజాలు గాలి లేదా వర్షపు చుక్కల ద్వారా ఇతర మొక్కలకు లేదా పొలాలకు వ్యాపిస్తాయి. గాలిలో ఎక్కువ తేమ, తక్కువ వర్షపాతం మరియు 10-20°C ల ఉష్ణోగ్రతలు శిలీంద్రపు జీవిత చక్రానికి మరియు తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకడానికి మరియు వ్యాప్తికి గాలిలో తేమ మరియు ఉష్ణోగ్రతల ఆధారంగా 10-15 రోజులు అవసరం. వేసవి కాలంలో ఈ తెగులు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఈ తెగులు దిగుబడి నష్టాలకు దారి తీస్తుంది మరియు గడ్డల నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన విత్తనాలు మరియు నారును ఉపయోగించాలి.
  • ఈ తెగులు వ్యాప్తిని అరికట్టడానికి గాలి ప్రసరణకు వీలుగా మొక్కల మధ్య సిఫారస్సు చేయబడిన దూరం పాటించాలి.
  • మంచి మురుగు నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి మరియు అదనంగా నీరు పెట్టడం మానండి.
  • కలుపు తీసేటప్పుడు వెల్లుల్లి గడ్డలకు హాని జరగకుండా చూసుకోండి.
  • అధిక నత్రజని కలిగిన పొలాల్లో ఉల్లి జాతి రకాన్ని సాగు చేయరాదు.
  • పోటాష్ ఎరువులను (ఉదాహరణకు సల్ఫేట్ ఆఫ్ పోటాష్) ఉపయోగించండి.
  • రాత్రి కంటే ఉదయం వేళల్లో నీటి తడులను పెట్టాలి.
  • ఈ తెగులు లక్షణాలకు పొలాన్ని తరుచూ గమనిస్తూ ఉండాలి.
  • తెగులు సోకిన మొక్కలను తొలగించి కాల్చివేయాలి.
  • కనీసం రెండు-మూడు సంవత్సరాలకు ఒక సారి పంట మార్పిడి చేయండి.
  • వ్యవసాయ పనిముట్లు, పరికరాలను శుభ్రంగా కడిగి క్రిమి రహితంగా ఉంచండి.
  • ఏవైనా ఉల్లి జాతి మొక్కలు సహజంగా పెరిగితే వాటిని వెంటనే తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి