ఉల్లిపాయ

తెల్ల కుళ్ళు తెగులు

Stromatinia cepivora

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు పైఅంచుల నుండి పసుపు రంగులోకి మారి వాలిపోతాయి.
  • మొక్క మొదలు వద్ద వద్ద నల్లని మచ్చలతో కూడిన దూది లాంటి తెల్లని శిలీంధ్ర పెరుగుదల కనిపిస్తుంది.
  • వేర్లు కుళ్లిపోయి కాడలు, గడ్డలు క్షీణిస్తాయి.
  • మొక్కలు పైనుండి పతనమై చనిపోతాయి.

లో కూడా చూడవచ్చు

3 పంటలు
వెల్లుల్లి
ఉల్లిపాయ
బఠానీ

ఉల్లిపాయ

లక్షణాలు

పంట యొక్క ఏ దశలోనైనా తెగులు సంక్రమించవచ్చు అయితే లక్షణాలు మొదట ముదురు మొక్కలపై కనిపిస్తాయి. ఆకులు, అంచులనుండి మొదలయ్యి క్రింది వైపుకు పసుపు రంగులోకి మారతాయి. తరువాత మొక్క వెళ్ళిపోయి డై బ్యాక్ చెందుతాయి. (చివర్లనుండి వెనుకకు ఎండిపోతాయి). తెగుల లక్షణాలు గమనించేసరికే, శిలీంద్రం మొక్క యొక్క వేర్లు, కాండం, గడ్డ మరియు ఆకు ఈనేలపై దాడి జరిపి ఉంటుంది. ఉల్లి గడ్డను పీకి చూసినట్లయితే గడ్డ ఆడుగు భాగంలో శిలీంద్రపు పెరుగుదలను గమనించవచ్చు. ప్రధాన వేర్లు కుళ్ళిపోతాయి. తరువాత వచ్చిన వేర్లు పెరిగి అడ్డంగా విస్తరించబడి ఇతర మొక్కలకు సోకడానికి కారణమవుతాయి. మొక్కలు కొద్ది రోజులనుండి ఒక వారంలోనే క్షీణిస్తాయి, అందు వలనే తెగులు లక్షణాలు పొలంలో గుంపులుగా కనబడుతాయి.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ట్రైకోడేర్మా, ఫ్యుజేరియం, గ్లియోక్లాడియం లేదా కిటోమియం ఈ తెల్ల కుళ్ళు శిలీంద్రం పై పరాన్న జీవులుగా ఉండి, పెరుగుదలను తగ్గిస్తాయి. అలాగే ట్రైకోడేర్మా హర్జియనం, తెరాటోస్పెర్మా ఒలిగోక్లాడం లేదా లాటేరిస్పోరా బ్రేవిరామా కూడా ఉపయోగకరమైనవి. సార రహిత పొలాల్లో వెల్లుల్లి సారం ఉపయోగించినట్లైతే శిలీంద్రం పెరుగుదల, శిలీంద్ర బూజు ఉత్పత్తి ఉద్దీపన చెందుతాయి. దీని వలన తర్వాత కాలాల్లో తెగులు తీవ్రత తగ్గుతుంది. వెల్లుల్లి పొట్టు తీసి నలిపి 10 లీటర్ల నీటికి కలిపి, పొలంలో 10 లీటర్లు/చదరపు మీటరుకు చొప్పన వాడాలి. ఈ శిలీంద్రం పెరుగుదలకు 15-18°C ఉష్ణోగ్రత పరిస్థితులు చాలా అనుకూలం, అందుకే ఈ సమయంలో దీనిని ఉపయోగించుకోవడం మంచిది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెల్ల కుళ్ళు తెగులు కల్చర్ పద్ధతులు ఈ ఫంగస్ ను అదుపు చేయడంలో చాల బాగా పనిచేస్తాయి. శిలీంద్ర నాశినులైన టేబుకోనేజోల్, పెంధాయోపైరాడ్, ఫ్లూడియోక్సోనిల్ లేదా ఇప్రోడియోన్ వంటివి నాటుటకు ముందు నేలలో వేయాలి లేదా నాటిన తర్వాత మొక్కలపై పిచికారి చేయాలి. ఈ తెగులు నివారణకు ఉపయోగించే పద్ధతులు ఆ మందులలో వుండే క్రియాశీల ఏజంట్ బట్టి ఉంటుంది.

దీనికి కారణమేమిటి?

స్క్లేరోషియం సేపివోరం అనే మట్టి జనిత శిలీంద్రం వల్ల ఈ తెగులు కలుగుతుంది. ఈ నిద్రాణమైన శిలీంద్ర బీజాంశం 20 సంవత్సరాల వరకు కొనసాగడం వలన మొక్కలు చాలా సాధారణంగా నేల ద్వారా తెగులుకు సంక్రమించబడతాయి. తెగులు తీవ్రత నేలలోని శిలీంద్రపు మొత్తముపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి మట్టిలో చేరినట్లైతే ఈ ఫంగస్ ను వదిలించుకోవడం కష్టం. ఇతర ఉల్లి జాతుల వేర్లు ఈ శిలీంద్రము యొక్క జీవిత చక్రం మరియు అభివృద్ధికి అనుకూలిస్తాయి. ఈ తెగులు చల్లని (10-24°C) తేమ నేల పరిస్థితులలో కనపడి, భూగర్భ శిలీంద్ర, నీరు, నారు మరియు పనిముట్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెల్ల కుళ్ళు తెగులు ఉల్లికి కలిగించు నష్టాలలో ప్రధానమైనది. ఒక పొలంలో పని చేసిన పనిముట్లతో వేరొక పొలంలో పనిచేయడానికి ముందు పరికరాలను శుభ్రంగా కడిగి క్రిమి రహితంగా శుభ్రపరుచుకోవాలి.


నివారణా చర్యలు

  • ఎర్ర ఉల్లి గడ్డలు లాంటి తక్కువ గురయ్యే రకాలు నాటుకోవాలి.
  • ఆరోగ్యకరమైన విత్తనాలు మరియు నారును ఉపయోగించాలి.
  • నాటే ముందు గడ్డ అడుగు భాగంలో బూజు కొరకు పరిక్షించుకోవాలి.
  • ధ్రువీకరించబడిన నారు దొరకని పక్షంలో గడ్డల బదులుగా విత్తనాలను వాడుకోవాలి.
  • మంచి మురుగు నీటి సదుపాయం ఏర్పరుచుకోవాలి.
  • మొక్కలకు నీటిని అధికంగా పెట్టవద్దు.
  • అధిక నత్రజని ఎరువులను వాడరాదు.
  • తెగులు లక్షణాల కోసం పొలాన్ని తరచూ గమనిస్తూ ఉండాలి.
  • తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి.
  • తదుపరి వ్యాప్తిని నిరోధించుటకు వాటిని ఎరువుగా వాడరాదు.
  • వ్యవసాయ పనిముట్లు, పరికరాలను శుభ్రంగా కడిగి క్రిమి రహితంగా శుబ్రపరచుకోవలెను.
  • పంట మార్పిడి చేయాలి.
  • లోపలి మట్టికి సూర్యరశ్మి తగిలేలా లోతుగా దున్నుకోవాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి