బంగాళదుంప

బూడిద పొక్కు తెగులు

Spongospora subterranea

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ముదురు రంగులో బీజాంశాలు కలిగిన బొడిపెలు పగిలి కార్క్ లాంటి గీతాలు ఏర్పడతాయి.
  • ఈ మచ్చలు లోపలకు వ్యాపించి లోతైన గుంతలు తయారు అవుతాయి మరియు అంతర్గత కణజాలాలు నాశనం అవుతాయి.
  • దుంపలు ఆకారం కోల్పోతాయి.
  • పంటను నిల్వ ఉంచినప్పుడు ఈ లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి.

లో కూడా చూడవచ్చు


బంగాళదుంప

లక్షణాలు

కొద్దిగా పైకి లేచినట్టు వున్న, గుండ్రటి ఆకారంలో ఉండి మెత్తగా స్పాంజి లాగ వున్న ఊదారంగు బుడిపెలు బంగాళా దుంప పైన కనిపిస్తాయి. ఇవి సైజులో పెరుగుతునపుడు ఇవి అన్నీ కలిసిపోయి సక్రమంగా లేని ఒక పెద్ద మచ్చ లాగా ఏర్పడతాయి. తరువాత ఇవి పగిలి దుంప తోలును చీల్చి కార్క్ లాంటి లోతు తక్కువగా వున్న పుండు లాగ ఏర్పడుతుంది. దీనినే స్కాబ్ అని అంటారు. వాపు, పులిపిరులు లాగ ఏర్పడి దుంపల రూపం మారి అమ్మడానికి పనికిరాకుండా ఉంటాయి. తేమ అధికంగా వుండే మట్టిలో ఈ పుండ్లు లోపలకు విస్తరిస్తాయి. దీనివలన బాగా లోతుగా గుంతలు ఏర్పడి దుంప లోపల నాశనం చేస్తాయి. దుంపలను నిల్వ చేసినపుడూ ఈ తెగులు ఇంకా ఎదుగుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బూడిద పొక్కు తెగులుకు జీవ సంబంధిత నియంత్రణ లేదు. అందువలన నివారణ చర్యలు మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వాతావరణాన్ని బట్టి పొలంలో విత్తనాలను నాటడానికి ముందే మేటమ్ సోడియం లేదా ఫ్లూఅజినామ్ ను తడపడం వలన ఉపయోగం ఉంటుంది.

దీనికి కారణమేమిటి?

బూడిద పొక్కు తెగులు మట్టిలో ఉండే ఫంగస్ వలన కలుగుతుంది. ( స్పోన్గోస్పోరా సబ్ టెర్రనియా) ఈ ఫంగస్ మట్టిలో ఆరు సంవత్సరాలవరకు జీవించి ఉంటుంది. ఈ తెగులు చల్లటి ఉష్ణోగ్రతల్లో మరియు అధిక ఆమ్లత్వం కలిగిన నేలల్లో కనిపిస్తుంది. ఒకసారి తడి మరియు ఇంకొకసారి పొడి వాతావరణం కూడా దీనికి అనుకూలం. తెగులు సోకిన దుంప, బట్టలు, పొలంలో పనిచేసేటప్పుడు వాడే పరికరాలు మరియు పెంట ఈ సూక్ష క్రిములను కలిగి ఉంటాయి. ఇది దుంపల తయారౌతున్నపుడూ పొక్కులు లాంటి కన్ను లేదా పుండ్లు ద్వారా సోకుతుంది. రస్సేట్ బంగాళాదుంప రకాలు ఈ తెగులుకు మంచి నిరోధకత కలిగివుంటాయి. సొలనేసియా జాతి పంటలలో చాలా రకాల పంటలకు ఈ తెగులు సోకే అవకాశం అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక విత్తన రకాలు వాడాలి.
  • ఆరోగ్యమైన ఉన్న విత్తనాలే వాడాలి.
  • సరైన సమన్వయంతో పంట మార్పిడి చేయాలి.
  • నీటి పారుదల బాగా ఉన్న భూమి లోనే నాటాలి.
  • పొలంలో నీరు నిలువ ఉండకూడదు.
  • ప్రత్యామ్నాయ అతిధి పంటలను పొలం చుట్టూ నాటటానికి ప్రయత్నించాలి.
  • మట్టిలో pH ను నియంత్రించడానికి భూమిలో సల్ఫర్ ను వేయాలి.
  • పొలంలో ఉపయోగించే పరికరాలను సరిగా శుద్ధి చేయాలి.
  • పంట కోత తర్వాత పొలాన్ని బాగా లోతుగా దున్ని మట్టికి బాగా సూర్యరశ్మి తగిలేటట్టు చేయడం వలన ఉపయోగం ఉంటుంది.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి