క్యాబేజీ

క్లబ్ రూట్

Plasmodiophora brassicae

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు పసుపు రంగులోకి మారడం మరియు వాలిపోవడం.
  • వేర్లపై ముడుల వంటి వాపు.
  • మొక్కల ఎదుగుదల తగ్గిపోవడం.
  • దిగుబడి తగ్గడం.
  • మొక్కలు కుళ్లిపోవడం.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
క్యాబేజీ
కాలీఫ్లవర్

క్యాబేజీ

లక్షణాలు

లక్షణాలు భూమి పైన మరియు భూమి క్రింద కూడా గమనించవచ్చు. మొత్తంమీద, మొక్కలు క్షీణిస్తాయి. ఎదుగుదల తగ్గడం మరియు ఆకులు పసుపు రంగు లోకి మారడం జరుగుతుంది. పొడి వాతావరణంలో ఆకులు వాలిపోతాయి కాని తడి పరిస్థితులలో కోలుకుంటాయి. ఆకులు ఊదా రంగులోకి మారవచ్చు. వేర్లపై ముడుల వంటి వాపుల వృద్ధి చెందడం మరియు చిన్న వేర్లను కోల్పోవడం (రూట్ హెయిర్స్ అని కూడా పిలుస్తారు) భూమి క్రింద ఉండే లక్షణాలు. కాలక్రమేణా, ఈ వాపులు తీవ్రమైన వక్రీకరణకు దారితీస్తాయి. సాధారణ నెట్‌వర్క్‌కు బదులుగా వేర్లు క్లబ్ ఆకారంలోకి మారతాయి(దీనివల్లనే ఈ తెగులుకు ఈ పేరు వచ్చింది)ఎదుగుదల మరియు దిగుబడి తీవ్రంగా తగ్గుతుంది అంతేకాక ఈ తెగులు తీవ్రంగా సోకిన మొక్కలు చనిపోవచ్చు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

శరదృతువులో, మట్టిలో నత్తగుల్ల లేదా డోలమైట్ సున్నం కలపడం ద్వారా నేల యొక్క pH ను మరింతగా ఆల్కలీన్ 7.2 కు పెంచడం అందుబాటులో ఉన్న ఏకైక సేంద్రీయ నియంత్రణ (చిన్నకారు తోటమాలులు మరియు రైతులకు). పిహెచ్‌ను తరచుగా తనిఖీ చేయడానికి సరళమైన మరియు సరసమైన మట్టి పరీక్ష వస్తు సామగ్రి అందుబాటులో ఉన్నాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సాయిల్ ఫ్యుమిగేషన్ సిఫార్స్ చేయబడలేదు ఎందుకంటే అవి 100 శాతం ప్రభావవంతంగా పనిచేయడం లేదు. నాటడానికి ముందు సున్నపురాయి (కాల్షియం కార్బోనేట్ CaC03) మరియు హైడ్రేటెడ్ సున్నం (కాల్షియం హైడ్రాక్సైడ్ Ca (OH) 2) ను కలిపి pH (7.2) ను పెంచడం ఈ తెగులు రాకుండా తగ్గించడానికి ఒక మార్గం.

దీనికి కారణమేమిటి?

మట్టిలో నివాసం వుండే వ్యాధికారక ప్లాస్మోడియోఫోరా బ్రాసికే వలన వేర్ల సంక్రమణ ద్వారా తెగులు లక్షణాలు సంభవిస్తాయి. ఇది ఇతర మొక్కలలో, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీలు, కాలీఫ్లవర్లు, టర్నిప్‌లు మరియు ముల్లంగి వంటి ముఖ్యమైన పంటల శ్రేణిని ప్రభావితం చేసే ఒక పరాన్నజీవి. 20 సంవత్సరాల వరకు మట్టిని కలుషితం చేసే నిద్రాణమైన బీజాంశాలను ఉత్పత్తి చేయడం ఫంగస్ యొక్క వ్యూహం. మొక్కల వేర్ల దగ్గర ఈ బీజాంశాలు మొలకెత్తుతాయి మరియు వేర్ల వెంట్రుకలకు సోకుతాయి, దీని వలన వేర్లలో వాపు వస్తుంది. అందు వల్లనే ఈ తెగులుకు ఈ పేరు వచ్చింది. ఈ వాపులు మట్టిలో విడుదలయ్యే మరిన్ని బీజాంశాలను ఉత్పత్తి చేసి చక్రాన్ని పూర్తిచేస్తాయి. తేమ మరియు వెచ్చని నేలలు ఈ తెగులుకు అనుకూలంగా ఉంటాయి. మట్టి pH ను పెంచడం ద్వారా క్లబ్ రూట్ తెగులు తగ్గించబడుతుంది (కాని తొలగించబడదు).


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన మొక్కల నుండి లేదా ధృవీకరించబడిన మూలాల నుండి సేకరించిన విత్తనాలను ఉపయోగించండి.
  • అందుబాటులో ఉంటే మరింత నిరోధక శక్తి కలిగిన రకాలను నాటండి.
  • అధిక తేమను నివారించడానికి ఎతైన మడులలో నాటండి.
  • పొలంలో మంచి మురుగు నీటి పారుదల సౌకర్యం ఏర్పాటు చేయండి.
  • అధికంగా నీరు పెట్టకండి.
  • కలుషితమైన వనరుల నుండి నీరు పెట్టవద్దు.
  • అనేక సంవత్సరాలు వైవిధ్యభరితమైన పంటలతో పంట మార్పిడి చేయండి.
  • తెగులు చరిత్ర ఉన్న ప్రాంతాల్లో నాటవద్దు.
  • మంచి నేల నిర్మాణం మరియు అధిక నేల pH (7.2) కు మద్దతు ఇవ్వండి, ఉదాహరణకు సున్నం వేయడం ద్వారా.
  • ఉపకరణాలు మరియు పరికరాలపై లేదా పాదరక్షలపై కలుషితమైన మట్టి వ్యాపించకుండా జాగ్రత్త వహించండి.
  • పొలంలో మరియు చుట్టుపక్కల పరిసరారలో కలుపు మొక్కలను నియంత్రించండి.
  • ఐనోక్యులమ్ స్థాయిని తగ్గించడానికి పంట కోత తర్వాత మట్టికి సూర్యరశ్మి తగిలేటట్టు చూడండి.
  • పొలంలో నుండి తెగులు సోకిన వేర్లను తొలగించి నాశనం చేయడం ద్వారా ఐనోక్యులమ్‌ను తగ్గించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి