చిక్కుడు

తుప్పు తెగులు

Uromyces appendiculatus

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • గోధుమ, పసుపు రంగులో చిన్న స్ఫోటములు ముదురు ఆకుల బాహ్యచర్మం చించుతాయి.
  • ముఖ్యంగా కింది పక్క.
  • స్ఫోటములు పసుపు రంగు పదార్థాల్లతో కప్పబడి ఉంటాయి.
  • ఇవి కాండాలు మరియు కాయలపై కూడా వ్యాపిస్తాయి.
  • ఆకులు రంగుకోల్పోయి ముందుగానే రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చిక్కుడు

లక్షణాలు

పై తొక్క చిరిగిపోయినట్టు వుండే గోధుమరంగు నుండి పసుపు బుడిపెలు ముదురు ఆకుల ప్రక్కభాగంలో ఏర్పడతాయి. ఈ బుడిపెలు చుట్టూ పసుపు రంగు వలయంతో వుంది ముదురు రంగులోకి మారవచ్చు. ఇవి కాండాలు, కాడలు మరియు కాయలపై కూడా వ్యాపిస్తాయి . ఆకులు ఎండిపోయి ముందుగానే రాలిపోతాయి. దీని ప్రభావం పంట దిగుబడిపైన పడుతుంది. తుప్పు తెగులు వలన చిన్న మొక్కల్ని చనిపోతాయి కానీ ఎదిగిన మొక్కలలో దీని ప్రభావం పెద్దగా ఉండదు.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

బాసిల్లస్ సబ్టిలిస్, అర్ధోరోబాక్టర్ మరియు స్ట్రెప్టోమైసెస్ వంటి జీవకీటకనాశినులు ఈ తెగులును నియంత్రించి వ్యాపించకుండా చేస్తాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. త్రయాజోల్ మరియు స్ట్రోబిల్లురిన్ సీలింద్ర నాశినులు ఈ తెగులును నియంత్రించడంలో మంచి ఫలితాలను అందిస్తాయి.

దీనికి కారణమేమిటి?

యూరోమైసెస్ అప్పెండిక్యులేటస్ ఫంగస్ మట్టిలో ఉన్నమొక్కల అవశేషాల్లో జీవిస్తాయి. ఇది జీవించటానికి మొక్క కణజాలాన్ని తింటుంది. ఇది ఒక ఆబ్లిగేట్ పారసైట్. మొక్కల సహాయం లేకుండా ఇది బ్రతకలేదు. గాలిద్వారా నీటి ద్వారా మరియు కీటకాల వలన ఈ తెగులు ముందుగా వ్యాపిస్తుంది. ఈ ఫంగస్ అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో చురుకుగా ఉంటుంది. ఈ వాతావరణంలో ఇది చాల త్వరితంగా విస్తరిస్తుంది. ఎక్కువ కాలం వేడి, తేమ శాతం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో అధికంగా ఉంటుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక లేదా రకాలు నాటాలి.
  • తెగులు సోకిన ప్రదేశాల్లో మొక్క నాటకూడదు.
  • మొక్కజొన్న లాంటి అంతరపంటలు వేయాలి.
  • కలుపును తొలగించాలి.
  • ఎక్కువ నీరు పెట్టకుండా జాగ్రత్త పడాలి మరియు స్ప్రింక్లర్ వాడకూడదు.
  • వ్యాధి సోకిన మొక్కలను తొలగించాలి.
  • మొక్క అవశేషాల్ని పొలంలోంచి తీసివేసి నాశనం చేయాలి.
  • వాతావరణం వేడిగా ఉన్నపుడు నాట్లు వేసే రోజుల్ని జాగ్రత్తగా ఎన్నుకోవాలి.
  • ఆకులపైన అధిక సమయం తేమ లేకుండా చూసుకోవాలి.
  • అధిక మొత్తంలో నత్రజని వాడకండి.
  • అవసరమైన మోతాదులో పోటాషియం వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి