పీచ్

పీచ్ లో ఆకు ముడత

Taphrina deformans

శీలీంధ్రం

5 mins to read

క్లుప్తంగా

  • ఆకులు వైకల్యం చెందుతాయి మరియు ఎర్రటి రంగులోకి మారుతాయి.
  • ఆకులపై శీలింద్ర పెరుగుదల కనిపిస్తుంది.
  • ఆకులు అకాలంగా రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

3 పంటలు
బాదం
అప్రికోట్
పీచ్

పీచ్

లక్షణాలు

సాధారణంగా ఆకు బరస్ట్ అయిన వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. చెట్ల రకాలను బట్టి ఆకులు దళసరిగా మారి తీవ్రంగా వక్రీకరించబడి, ముడుచుకుపోయి, నలిగి లేదా వంకరగా అయ్యి ఎరుపు నుండి ఊదా రంగులోకి మారుతాయి. ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందేకొద్దీ ప్రభావితమైన ఆకుల ఉపరితలంపై శీలింద్రం వృద్ధి చెందడం వల్ల ఆకుల ఉపరితలంపై తెల్లటి-బూడిద, పౌడర్ రంగులోకి మారుతాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ బూడిద రంగు క్రమంగా నల్లగా మారుతుంది, చివరికి, ఫంగస్ సోకిన ఆకులు చనిపోయి రాలిపోతాయి. దీనివలన చెట్టు సత్తువని కోల్పోతుంది. అదే స్థానం నుండి కొత్త ఆకులు వస్తాయి. సంక్రమణ అంతర్వాహికమైనప్పుడు బెరడు లేదా మొత్తం రెమ్మల ప్రాంతంలో కూడా నల్లబడతాయి, ఈ సమయంలో మొక్క యొక్క అంతర్గత కణజాలాలలో ఫంగస్ వ్యాప్తి చెందడం ప్రారంభమవుతుంది. అటువంటి సందర్భాల్లో, పెరిగే కొనలు ప్రక్క భాగంలో అసాధారణమైన మరియు మంత్రగత్తె చీపురును పోలిన రెమ్మలను ఉత్పత్తి చేస్తాయి. చెట్లకు తీవ్ర స్థాయిలో వ్యాధి సోకినట్లైతే పండ్ల ఉపరితలం నాటకీయమైన మార్పును చూపుతుంది.

Recommendations

సేంద్రీయ నియంత్రణ

ఈ ఫంగస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బోర్డియక్స్ మిశ్రమం వంటి సేంద్రీయ రాగి సమ్మేళనాలను కలిగి ఉన్న శిలీంద్ర నాశినుల పిచికారీని ఉపయోగించవచ్చు. శరదృతువు సీజన్లో ఆకులు రాలిన తర్వాత మరియు మళ్లీ వసంతకాలంలో మొగ్గలు ఎదగడం ప్రారంభమయ్యే ముందు మొదటి చికిత్స చేయాలి. రాగి ఉత్పత్తులను పదేపదే ఉపయోగించడం వల్ల మట్టిలో రాగి పేరుకుపోయి మట్టిలో జీవించే జీవులకు ఇది విషపూరితంగా మారుతుందని గమనించండి

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. కాపర్ ఆక్సీక్లోరైడ్, కుప్రిక్ హైడ్రాక్సైడ్, థైరామ్, జిరామ్, క్లోరోథలోనిల్ లేదా డైఫెనోకోనజోల్ కలిగిన శిలీంద్ర నాశినులను ఉపయోగించవచ్చు. శరదృతువు సీజన్లో ఆకులు రాలిన తర్వాత మరియు మళ్లీ వసంతకాలంలో మొగ్గలు ఎదగడం ప్రారంభమయ్యే ముందు మొదటి చికిత్స చేయాలి.

దీనికి కారణమేమిటి?

టాఫ్రినా డిఫార్మన్స్ అనే శిలీంధ్రం మొక్కల కణజాలంలో ఆవాసం ఏర్పరుచుకోవడం వల్ల లక్షణాలు ఏర్పడతాయి. ఆకు ఉపరితలంపై ఉత్పత్తి చేయబడిన బీజాంశాలు వర్షం తుంపర్ల ద్వారా లేదా కొమ్మలు మరియు మొగ్గలపై గాలి వీయడం ద్వారా కొట్టుకుపోయి కొత్త ఇన్ఫెక్షన్లను ప్రారంభిస్తాయి. వసంత ఋతువులో మొగ్గలు తెరుచుకోవడం వలన, ఇంకా విచ్చుకోని ఆకులను సోకడం ద్వారా తరచుగా పడే వర్షాల సమయంలో బీజాంశం మొలకెత్తుతుంది. బీజాంశం ఆకు మొగ్గలోకి ప్రవేశించిన క్షణం నుండి, ఇన్ఫెక్షన్ ప్రక్రియను ఆపడానికి సమర్థవంతమైన ప్రతిఘటన అనేది లేదు. ఈ సమయంలో వర్షం పడకపోతే, బీజాంశం క్రియారహితంగా ఉంటుంది మరియు ఇన్ఫెక్షన్ సంభవించదు లేదా సంక్రమణ తీవ్రత తక్కువగా ఉంటుంది. వేసవి కాలమంతా మరియు ఆ తర్వాత వచ్చే శీతాకాలం వరకు మొగ్గ పై తొడుగు లేదా బెరడులోని పగుళ్లలో ఉండి చివరికి అవి తదుపరి సీజన్‌లో మొలకెత్తుతాయి. 16°C ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే ఫంగస్ చురుకుగా ఉంటుంది మరియు ఈ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే పునరుత్పత్తి చేయగలదు. టాఫ్రినా డిఫార్మన్స్ పీచ్ చెట్లు మరియు మకరంద పండ్ల చెట్లు, బాదం మరియు ఒకోసారి ఆప్రికాట్లు మరియు ప్రూనస్‌ అలంకారమొక్కలకు సోకుతుంది.


నివారణా చర్యలు

  • మొగ్గ విచ్చుకునే దశలో వర్షం నుండి మొక్కలకు రక్షణ కల్పించండి మరియు ఆకులపై నీరు పడేటట్టు మొక్కలకు పైనుండి నీరు పెట్టకండి.
  • ఆకుల మధ్య గాలి మరియు వెలుతురు బాగా ప్రసరించడానికి వీలుగా ప్రతి సంవత్సరం చెట్టు పైభాగంలోని ఆకులను కత్తిరించండి.
  • పరిమిత మోతాదులో ఎరువులు వాడండి.
  • మొగ్గ విచ్చుకునే సమయానికి ముందు మొక్కల బలవర్ధక పోషకాలను వాడండి.
  • స్థితిస్థాపక రకాలను ఉపయోగించండి, ఉదాహరణకు, తెల్లని కండ కలిగిన రకాలు.
  • వ్యాధి సోకిన ఆకులు, మమ్మీ లాగ అయిన పండ్లు మరియు రెమ్మలను తొలగించి నాశనం చేయండి.
  • ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి సాధ్యమైనప్పుడల్లా ప్లాస్టిక్‌ రెయిన్ షెల్టర్‌ను ఉపయోగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి